ఉండేదేమో పక్కపక్కనే.. కానీ సమయంలో 21 గంట తేడా..!

సాధారణంగా సమయం అనేది టైం జోన్ ప్రకారం వివిధ ప్రాంతాలలో వేరు వేరుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.వివిధ దేశాలతో మనం కంపేర్ చేస్తే అమెరికా సమయం కంటే మన భారతదేశం సమయం పదిన్నర గంటల సమయం ముందుగానే ఉంటాం.

 21 Hours, Differ, Big Diomede, Little Diomede, Russia, America, Viral ,time Zone-TeluguStop.com

అదే పక్క దేశాలతో పోలిస్తే.బంగ్లాదేశ్, భారత్ కంటే అరగంట ముందంజలో ఉంటుంది.

అదే న్యూజిలాండ్ దేశంతో పోలిస్తే మన భారతదేశం ఏడున్నర గంటలకు వెనబడి ఉంటాము.ఇలా దేశాల దూరాన్ని బట్టి టైం జోన్ ప్రకారం సమయంలో కాస్త తేడాలు ఉండడం మనకు తెలిసిన విషయమే.

ఇది ఇలా ఉండగా.పక్కన పక్కనే ఉండే ప్రాంతాలలో ఈ సమయంలో కూడా స్వల్ప తేడా ఉంటుంది.

కానీ డయోమెడ్‌ దీపాలలో మాత్రం అలా కాదు.ఆ రెండు దీపాలు ఉండేది పక్క పక్కనే కానీ, వాటి సమయం మాత్రం 21 గంటల తేడా ఉంటుంది.

ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.? అయితే మీకు ఈ విషయం తెలిసిందే.

వాస్తవానికి రష్యా- అమెరికా దేశాలను విభజిస్తూ బేరింగ్‌, చుక్చి సముద్రాల సముద్రాల మధ్య రెండు ద్వీపాలు ఉంటాయి.ఈ రెండు ద్వీపాలను 1728 సంవత్సరం డెన్మార్క్‌- రష్యాకు చెందిన నావికుడు వైటస్‌ బేరింగ్‌ అనే అతను కనిపెట్టాడు.

ఈ రెండు ద్వీపాలకు కూడా గ్రీన్ దేవుడైన డయోమెడ్‌ పేరు పెట్టి, విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ద్వీపానికి  బిగ్ డయోమెడ్‌ అని విస్తీర్ణంలో చిన్నగా ఉన్న దానిని లిటిల్‌ డయోమెడ్‌ అని పేరు పెట్టారు.ఈ రెండు ద్వీపాల మధ్య కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న  కానీ కాల సమయంలో మాత్రం ఏకంగా 21 గంటలు తేడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ ద్వీపాలలో ఒకటి టైం జోన్‌ మొదటిలో ఉంటే మరొకటి చివర్లో ఉంది.అందుకే ఈ రెండు ద్వీపాలు ఇంటర్నేషనల్ డెడ్ లైన్ వేరు చేస్తున్నది అందరూ అంటూ ఉంటారు.

దీని ప్రకారం బిగ్‌ డయోమెడ్‌ లో తేదీ మారిన 21 గంటల తర్వాత లిటిల్‌ డయోమెడ్‌ లో తేది మారుతుందని అర్థం.  అందుకోసమే లిటిల్‌ డయోమెడ్‌ ను ఎస్టర్డే అని, బిగ్‌ డయోమెడ్‌ ను టుమారో ఐలాండ్ అని అందరూ పిలుస్తూ ఉంటారు.

ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా ఇది అక్షర సత్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube