13 ఏళ్ల వయసు... గణితంపై పట్టు, యూరప్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు భారతీయ బాలిక

ఎంతోమంది బుర్రలను తొలిచేసే గణితంపై పట్టు రావడం సామాన్య విషయం కాదు.దీని కోసం ట్యూషన్లు, ప్రైవేట్ క్లాసులకు వెళ్లేవారు ఎందరో.

 Indian-origin Schoolgirl Youngest On Uk Team For Europe Math Olympiad, Aanya Goy-TeluguStop.com

కానీ 13 ఏళ్ల చిన్న వయసులోనే మ్యాథమేటిక్స్‌లో అపార ప్రతిభ చూపిన ఓ బాలిక ప్రతిష్టాత్మక యూరోపియన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో చోటు దక్కించుకుంది.వివరాల్లోకి వెళితే.

యూకేలో స్థిరపడిన 13 ఏళ్ల భారత సంతతి బాలిక అనన్య గోయల్‌ దక్షిణ లండన్‌లోని డల్‌విచ్‌లో అల్లీన్స్ స్కూల్‌లో చదువుతోంది.ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి గణితమంటే చాలా ఇష్టం.

మ్యాథ్స్‌లోని కఠినమైన సమస్యల పరిష్కారంపై లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా వినియోగించుకుని మరింత రాటుదేలింది.

లాక్‌డౌన్ సమయంలో ఇంటి దగ్గరే ఉండడంతో తన తండ్రి, మాజీ మ్యాథ్స్ ఒలింపియన్ అమిత్ గోయల్ శిక్షణలో గణితంపై పట్టు సాధించింది అనన్య.

అనంతరం యూకే మ్యాథమ్యాటిక్స్ ట్రస్ట్ (యూకేఎంటీ) నిర్వహించిన గణిత పరీక్షలు రాయడం, వాటిలో మంచి ఫలితాలు రావడంతో ఈజీఎంఓలో పోటీపడే బ్రిటన్ జట్టులో చోటు దక్కించుకుంది.

Telugu Aanya Goyal, Europemath, Indianorigin, Uk, Youngest Member-Telugu NRI

ఇందులో చోటు దక్కించుకోవడం అంత ఆషామాషీ కాదు.ప్రతి ఏడాది యూకేలోని 6 లక్షల మంది పాఠశాల విద్యార్ధులు యూకేఎంటీ పరీక్షలకు హాజరవుతారు.ఇందులో సత్తా చాటిన తొలి 1000 మందిని మాత్రమే నవంబర్‌లో బ్రిటీష్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు ఆహ్వానిస్తారు.

మళ్లీ వీరిలో మొదటి 100 మందిని జనవరిలో జరిగే బ్రిటిష్ మ్యాథ్స్ ఒలింపియాడ్ సెకండ్ రౌండ్‌కు ఆహ్యానించారు.ఇందులోనూ సత్తా చాటిన అనన్య… యూరోపియన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు ఎంపికైన యూకే బాలికల జట్టులో స్థానం సంపాదించింది.

తద్వారా యూరప్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనబోతున్న అతి పిన్న వయస్కురాలిగా అనన్య రికార్డుకెక్కింది.వచ్చే నెలలో జార్జీయాలో ఈ పోటీలు జరగనున్నాయి.అయితే కోవిడ్ కారణంగా పోటీలలో వ్యక్తిగతంగా హాజరవ్వాలా లేక రిమోట్‌ ద్వారా పాల్గొనాలా అనేది నిర్వాహక కమిటీ నిర్ణయిస్తుంది.అయితే యూకే టీమ్ రిమోట్ విధానాన్ని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోటీ కోసం యూరోపియన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు ఎంపికైన యూకే జట్టు ఒకే చోట సమావేశమయ్యే అవకాశం వుంది.

మూడేళ్ల క్రితం యూకేఎంటీ జూనియర్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌ సందర్భంగా అనన్య గోల్డ్ మెడల్ సాధించింది.

దీనితో పాటు మ్యాథ్స్ ఒలింపియాడ్స్‌లో వరుస విజయాలు సాధించడంతో ఈ అమ్మాయి దృష్టంతా యూరోపియన్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో దేశానికి పతకం సాధించడపైనే వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube