బంగారంలో ఉండే వివిధ క్యారెట్స్ మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసా..?!

మన భారతీయులకు ఎక్కువగా బంగారం అంటే ఇష్టం.మహిళలకు బంగారు ఆభరణాలు ధరించడం, కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం.

 Do You Know The Differences Between The Different Carats In Gold , Gold, Qualit-TeluguStop.com

మనం సాహజంగా ఎక్కువగా బంగారం గురించి ఏదైనా వార్తలు వస్తే ముందుగా. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు అనే పేర్లు వింటూనే ఉంటాం.

ఇంతకీ క్యారెట్ అంటే ఏమిటి.? ఆ మూడు రకాల బంగారాల మధ్య ఉన్న తేడా ఏమిటి.? అన్న విషయాలు మనమిప్పుడు తెలుసుకుందామా.నిజానికి క్యారెట్ అంటే బంగారం నాణ్యతకు ఒక సూచిక.దీనిని 0-24 మీద కొలుస్తూ ఉంటారు.24/24 అంటే బంగారం చాలా స్వ‌చ్ఛ‌మైన  బంగారం అని అందరూ అంటూ ఉంటారు.అదే 22/24, 18/24 ఐతే స్వచ్ఛమైన బంగారం కాదని వీటిలో ఇతర లోహాలు కలుపుతారని అర్థం.ఐతే 24 బంగారం లో కూడా 100 బంగారం ఉండదు, దీనిలో కూడా 99.99 స్వచ్ఛమైన బంగారం ఉంటుంది, మిగితా శాతం ఇతర ఏదైనా లోహాలు కలిసి ఉంటాయి.

ఇక అదే 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.ఇందులో బంగారం 91.67 శాతం బంగారం ఉంటుంది.అందువల్లనే అందరూ దీన్ని 916 గోల్డ్ అంటారు.అదే 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.ఇందులో బంగారం 75 శాతం ఉంటుందని దీనిని అందరూ750 ప్యూరిటీ బంగారం అని పిలుస్తూ ఉంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, మిగితది ఇతర లోహాలు కలిసి ఉంటాయి.సహజంగా  బంగారంతో పాటు  నికెల్, కాపర్, జింక్ లాంటి లోహాలను కలుపుతూ ఉంటారు.

Telugu Carats, Purity Gold, Gold, Difference, Gold Carats, Pure Gold, Quality-La

ఇక మూడు రకాల క్యారెట్లు బంగారంలలో 24 క్యారెట్ల బంగారం నాణ్యమైనది, స్వచ్ఛమైనది.చాలా వరకు ఆభరణాల తయారీలో 22 క్యారెట్ బంగారంని ఉపయోగిస్తూ ఉంటారు.మరికొంతమంది అయితే ఆభరణాల ధర తక్కువగా ఉండేందుకు 18 ఉపయోగిస్తూ ఉంటారు.

కాబట్టి కొందరు ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి ట్రిక్స్ వాడుతుంటారు.అందుకొరకు ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే ముందుగా ఈ మూడు క్యారెట్లలో ఏ బంగారమో  తెలుసుకొని మరీ కొనుగోలు చేయడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube