కేంద్రంపై కేటీఆర్ అవాకులు, చవాకులు.. బాగా పేల్చుతున్నారుగా..

తెలంగాణలో భానుడి భగభగలు అప్పుడే మొదలయ్యాయి.కానీ రాజకీయ వేడి ఎప్పుడో మొదలైందన్న విషయం తెలిసిందే.

 Telangana, Minister Ktr, Comments, Bjp Leaders, Minister Ktr Serious Comments On-TeluguStop.com

ఆటలో అరటిపండులా కాంగ్రెస్ అప్పుడప్పుడు వచ్చి పోతుండగా, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాత్రం ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.ఇక ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్న మాటను పెద్దలు చెబుతుంటారు తరచుగా.

ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర పార్టీల మధ్య ఇలాంటి పరిస్దితులే నెలకొన్నాయి.మీరేం చేశారు అంటే మీరేం చేశారు అన్న వాదనలే తప్పా ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు.

వరద సహాయం అంటూ పదివేలు పంచారు.వీటికి చాల మంది నోచుకోలేదు.కానీ రాష్ట్రంలో మాత్రం నిత్యావసర ధరలను అదుపు లేకుండా పెంచుతుంటే ప్రభుత్వం మాత్రం చర్య తీసుకోవడం లేదు.ఇక కేంద్రం మాత్రం తక్కువ తిందా.

గ్యాస్, పెట్రోల్, డిజిల్ వీటి వల్ల సామాన్యుని ఆర్ధిక పరిస్దితిలో చోటు చేసుకునే మార్పులు భరించ లేకుండా ఉన్నాయి.ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఆపి ప్రజల జీవితాల్లో అలుముకుంటున్న చీకట్లను తొలగించే దిశగా ఆలోచించాలని సామాన్య మానవుని ఆవేదనట.

ఇకపోతే తాజాగా కేటీయార్ కేంద్రం మీద అవాకులు, చవాకులు పేల్చుతున్నారు.పకోడీలు అమ్ముకుంటున్నవారిని చూపించి ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రధాని మోడీ చెప్పుకుంటారని, మాటలు కోట్లల్లో ఉంటే చేతలు మాత్రం పకోడీల్లో ఉంటాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ సాధించిన విజయాలు, బీజేపీ నేతల పసలేని మాటలు, చేసిన నిర్వాకాన్ని పట్టభద్రులకు అర్థం చేయించి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.మరి వారి మాటలు పకోడీలైతే ఆ పొట్లాలను కట్టేది మీరే కదా సార్.

మాటలు ఆపీ జనం మీద పడుతున్న భారాన్ని తగ్గించేలా చూడండని రాజకీయా నాయకుల చేష్టలతో విసిగిపోయిన ప్రజలు అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube