కొవిడ్ టీకా తీసుకున్న న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని.. !

దేశంలో కరోనా వ్యాక్సిన్ పక్రియలో వేగం పెరిగినట్లు సమాచారం.ఇదివరకే రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులంతా కోవిడ్ టీకా ఇప్పించుకున్నారు.

 Bjp Mp Hema Malini Vaccinated By Covid, Bjp Mp, Hema Malini, Covid 19, Vaccinate-TeluguStop.com

ఇంకా ఈ టీకా కోసం మరి కొంత మంది సిద్దం అవుతున్నారు.ఇకపోతే తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ న‌టి, హేమ‌మాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు.

ముంబైలోని కూప‌ర్ ఆస్ప‌త్రి వైద్యులు హేమ‌మాలినికి టీకా ఇచ్చారు.

ఈ మేరకు హేమ‌మాలిని నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా త్వరగా ఈ వ్యాక్సిన్ తీసుకోండి అని ట్వీట్ చేశారు.

ఇకపోతే దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 16 నుంచి కొన‌సాగుతున్న‌ విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ముందుగా పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి టీకాలు వేయగా, ఆ త‌ర్వాత పోలీసులకు వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

ఇదిలా ఉండగా మార్చి 1 నుంచి 45 సంవత్సరాలతో పాటుగా, 60 సంవత్సరాలు పైబ‌డిన వారికి అందులో దీర్ఘ‌కాలిక రోగాలు ఉన్న వారికి కూడా ఈ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube