అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందుతున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు ముందు బన్నీ మరియు సుకుమార్ లు ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నారు.అందుకే వీరి కాంబోలో మళ్లీ ఇండస్ట్రీ హిట్ వస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.
పుష్ప సినిమా లో బన్నీ ఎలా ఉండబోతున్నాడు అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది.సినిమా కథ ఏంటీ అనే విషయాన్ని ముందే చిత్ర యూనిట్ సభ్యులు స్వయంగా రివీల్ చేశారు.
కనుక సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయమై ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి నెలకొంది.అందులో భాగంగానే టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పుష్ప టీజర్ కు ముహూర్తం ఖరారు అయ్యింది.
వచ్చే నెలలో అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుక జరుపుకోబోతున్నాడు.
పుట్టిన రోజు సందర్బంగా బన్నీ అభిమానులు ఖుషీ అయ్యేలా పుష్ప టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఇప్పటికే టీజర్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇటీవలే తమిళ నాడు షెడ్యూల్ ను ముగించుకుని వచ్చిన సుకుమార్ రెండు వారాలుగా టీజర్ ను కట్ చేయించే పనిలో ఉన్నాడట.టీజర్ తోనే సినిమా రేంజ్ ను అమాంతం పెంచే ఉద్దేశ్యంతో సుకుమార్ టీజర్ విషయంలో గతంలో ఎప్పుడు లేనంతగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.60 నుండి 70 సెకన్ల పాటు ఈ టీజర్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.ఇక టీజర్ ను మూడు నాలుగు వర్షన్ ల్లో రెడీ చేస్తున్నారట.
సంగీతం తో సహా విభిన్నమైన మూడు నాలుగు టీజర్లను రెడీ చేసి నలుగురి అభిప్రాయం సేకరించి ఎక్కువ మంది ఓటు ఏ టీజర్ కు అయితే ఆ టీజర్ ను బన్నీ పుట్టిన రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.