వైద్యానికి డబ్బులు లేక తెలంగాణ శకుంతల ఎలా కన్ను మూసింది

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటులు ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇండస్ట్రీలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం లెజెండరీ యాక్టర్ అయిన ఎన్టీఆర్, ఎస్ వి రంగారావు లాంటి వారు వారి నటనతో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు అలాంటి వారు తెలుగు లో ఉండడం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే వాళ్లు పోషించని పాత్రలు లేవు.అలా ఇండస్ట్రీలో వీళ్లే కాదు ఇంకా చాలా మంది వారి వారి ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లారు అలాంటి వాళ్ళలో తెలంగాణ శకుంతల గారు కూడా ఒకరు.

 Telangana Shakunthala Untold Struggling Last Days , Telangana Shakunthala, Untol-TeluguStop.com

ఆవిడ మహారాష్ట్రలో జన్మించినప్పటికీ తెలుగు సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకున్నారు తెలంగాణ, రాయలసీమ యాసలో మాట్లాడుతూ జనాదరణ పొందారు.కమెడియన్ గా, విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా కూడా ఆమె చాలా సినిమాల్లో నటించారు.

ఆమె ఏ క్యారెక్టర్ లో నటిస్తే ఆ క్యారెక్టర్ లో ఒదిగి పోయి నటించేవారు.ముఖ్యంగా ఆమె చేసిన సినిమాల్లో ఒసేయ్ రాములమ్మ, నువ్వు నేను, సొంతం, లక్ష్మి, ఒక్కడు లాంటి చిత్రాలతో మంచి గుర్తింపును సాధించారు.

తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం ఎక్కువ సినిమాల్లో తెలంగాణకు సంబంధించిన యాసలో మాట్లాడితే చూసే జనాలు కూడా ఈవిడది తెలంగాణనే కావచ్చు అన్నంతగా వాళ్లని మైమరపించే యాక్టింగ్ తో ముందుకు దూసుకెళ్లారు శకుంతల.

Telugu Financial, Heart Attack, Days, Untold Story, Vijayashanthi-Movie

శకుంతల  భర్త పేరు ప్రసాద్ ఆయన ఒక విశ్రాంత ఉద్యోగి ముఖ్యంగా తెలంగాణ శకుంతల ఒక్కడు సినిమాలో నటించిన క్యారెక్టర్ గాను మంచి గుర్తింపును సాధించారు ఆ సినిమాలో విలన్ అయిన ప్రకాష్ రాజ్ తల్లిగా నటించి రాయలసీమ యాసలో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు.అలాగే వెంకటేష్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి సినిమాలో పోషించిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించింది వేణు మాధవ్ కి అప్పు ఇచ్చి దాన్ని రికవరీ చేసుకోవడానికి తిరుగుతూ ఉంటే వేణుమాధవ్ దగ్గర డబ్బు లేకపోవడంతో కహానీలు చెబుతూ ఉంటాడు దీంతో విసిగిపోయిన శకుంతల అతన్ని బర్రెల ఫామ్ లో పనికి పెట్టి అతని చేత పని చేపిస్తుంది వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు జనాన్ని కడుపుబ్బ నవ్విస్తాయి.తెలంగాణ శకుంతల తోటి ఆర్టిస్టులతో కాంట్రవర్సి లేకుండా పద్ధతి గా నడుచుకునేది.

Telugu Financial, Heart Attack, Days, Untold Story, Vijayashanthi-Movie

శకుంతల సినిమాలో వేరే యాక్టర్ కి తెలంగాణకు సంబంధించిన డైలాగ్స్ ఉన్నట్లయితే వాళ్లకి యాక్టింగ్ లో డైలాగ్స్ పలికేటప్పుడు కొన్ని మెళకువలను కూడా చెప్పేవారు.చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్లు వేసినప్పటికీ ఆవిడ చనిపోయే ముందు కొంత అనారోగ్యంతో బాధపడ్డారు హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి.ఒక సినిమా లో తెలంగాణ స్లాంగ్ మాట్లాడాల్సి రావడం వల్ల దానికి సంబంధించిన మెలుకువలు నేర్చుకోవడానికి విజయశాంతి శకుంతల గారిని రమ్మని పిలిపించుకుని మరి మెళుకువలు నేర్చుకున్నారు ఆవిడ మెలుకువలు నేర్పే ప్రాసెస్ లో ఆవిడ ఆరోగ్యం బాగాలేదన్న విషయం విజయశాంతి  తెలుసుకొని వాళ్ళ మేనేజర్ ని పిలిచి చెక్కు రాసి ఇచ్చారు అయితే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న తర్వాత శకుంతల చాలా సందర్భాల్లో విజయశాంతి డబ్బులు ఇచ్చినట్టు చెప్పారు.కానీ ఆ తర్వాత శకుంతల ఎక్కువ రోజులు బతకలేకపోయారు 2014లో గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube