శివరాత్రికి మరో ఆప్డేట్ తో రాబోతున్న ఆచార్య..!

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.చిరంజీవి 152 వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది.

 On The Occasion Of Shivaratri Acharya First Single To Be Out, Shivaratri 2021, A-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 30 నిముషాల పాటు ఉంటుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఆచార్య సినిమాను కొరటాల శివ సామజిక అంశాలతో రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన నటిస్తుండగా పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన నటిస్తుంది.ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva, Ram Charan, Shivaratri-Movie

తాజాగా ఈ సినిమా మారేడుమిల్లిలో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ షెడ్యూల్ లో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రికరించారు.అంతేకాదు పూజ హెగ్డే, రామ్ చరణ్ తో ఒక సాంగ్ కూడా చిత్రికరించారు.ఈ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో మళ్ళి రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

ఇంకో షెడ్యూల్ జరిగితే రామ్ చరణ్ పాత్ర పూర్తి అవుతుందని సమాచారం.

ఆచార్య సినిమా నుండి ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయ్యింది.

ఆ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.త్వరలో ఈ సినిమా నుండి మరొక అప్డేట్ రాబోతుందని టాక్ వినిపిస్తుంది.

మార్చి 11 న శివరాత్రి సందర్భంగా ఈ అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో భక్తి భావం ఎక్కువుగా ఉంటుందట.

అంతేకాదు ఈ సినిమాలో శివుడికి సంబంధించి ఒక పాట ఉందట.ఆ పాటను శివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.

కాగా ఈ సినిమా మే 13 న రిలీజ్ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube