నాగ చైతన్య ని కలిసేందుకు ఆ అభిమాని ఏకంగా...

మామూలుగా సినిమా సెలబ్రిటీలు బయటికి వచ్చినా లేదా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది అభిమానులు తమ అభిమాన నటీనటులను చూడడానికి షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలకి రావడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు ఫోటోలు దిగడం, ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవడం వంటివి చూస్తుంటారు.

 Fan Jumps To Meet His Favorite Hero Naga Chaitanya, Naga Chaitanya, Telugu Hero,-TeluguStop.com

 అయితే తాజాగా ఓ అభిమాని తాను ఎంతగానో అభిమానించే హీరో ని కలిసేందుకుగాను ఏకంగా నీటిలో దూకే సాహసం చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం టాలీవుడ్ హీరో నాగ చైతన్య తెలుగులో “థాంక్యూ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.దీంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ఓ నదిలో జరిగేటటువంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 దీంతో కొంతమంది ప్రజలు సినిమా షూటింగ్ ని చూసేందుకు నది వద్దకు వచ్చారు.ఈ క్రమంలో ఓ అభిమాని ఏకంగా నాగ చైతన్యను చూసేందుకు వచ్చి అతడిని కలవాలనుకున్నాడు.

దీంతో నాగ చైతన్య నదిలో పడవ మీద ప్రయాణిస్తుండగా బ్రిడ్జి మీద నుంచి చూస్తున్న అభిమాని ఏకంగా నదిలోకి దూకాడు.అనంతరం ఈదుతూ నాగచైతన్య పడవని అందుకున్నాడు.

ఈ విషయాన్ని గమనిస్తున్న స్థానికులు ఈసంఘటనని తమ చరవాణిలో బంధించి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.దీంతో నాగచైతన్య కూడా ఈ విషయంపై స్పందిస్తూ మరోమారు ఇలాంటి సాహసాలకి పాల్పడద్దని తన అభిమానులకు సూచించాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నాగచైతన్య హీరోగా నటించిన “వెంకీ మామ మరియు మజిలీ” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.కాగా ఇటీవలే నాగ చైతన్య తెలుగులో ప్రముఖ దర్శకుడు “శేఖర్ కమ్ముల” దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోగా నటించాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube