ఇదెక్కడి విడ్డూరం.. ఆ ఇంటి అద్దె రూ.1.26 కోట్లట.. !!

ప్రపంచంలో ఉన్న కుబేరుల ఇళ్లను చూస్తే ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా సామాన్యులు ఫీలవుతారు.ఇక వేలల్లో అద్దలు కట్టే వారికి ఆ ఇంటి అద్దె అసలు నిదురే లేకుండా చేస్తుంది.

 Rent Of A House In Hong Kong Is 1.26 Crore Rupees , China, Hong Kong, ‌house-TeluguStop.com

అంటే ఉన్న వాళ్లూ లగ్జరీ లైఫ్ కోసం సంపాదిస్తున్న డబ్బును ఖర్చు చేస్తుంటే, మధ్య తరగతి మనిషి మాత్రం కోరికలు చంపుకుని సాధారణ జీవితం అయిన గడిపితే చాలని బ్రతుకుతో పోరాటం చేస్తాడు.ఇదే ఉన్న వాడికి లేని వాడికి ఉన్న తేడా.

ఇకపోతే ఓ మూడు నుండి నాలుగు వేల అద్దె కట్టాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది.ఇంకాస్త డబ్బులున్న బాబులైతే వేలల్లో లేదా లక్షల్లో అద్దెలు చెల్లిస్తుంటారు.కానీ దక్షిణ చైనాలో హాంగ్ ‌కాంగ్ ‌లోని ఓ ఇంటి అద్దె మాత్రం రూ.1.26 కోట్లు అంట.అసలు ఇది ఇంటి అద్దెనా లేక ఇంటి ఖరీదా అని అనుమానం పడకండి.ఎందుకంటే ఇది అద్దె మాత్రమే.కాకపోతే ఈ ఇంటిలో స్టార్‌ హోటళ్లను మించిన గదులు, ఇతర సౌకర్యాలు ఉంటాయి.చూడటానికి ప్యాలేస్‌ ను తలపిస్తున్న ఈ ఇళ్లు 10,804 అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన గదులు, రకారకాల పూల తోటలతో నిర్మించారట.

ఇదే కాకుండా ఎన్నో ఆధునికమైన హంగులు ఈ ఇంటిలో ఉన్నాయట.

అంటే ముఖేష్ అంబానీ ఇంటికంటే ఇంకా విలువగలది అన్నమాట.ఇక హాంగ్‌ కాంగ్‌ లో అన్నిటికంటే అధిక అద్దె ఈ ఇంటికి ఉన్నట్లు నైట్‌ ప్రాంక్‌ ఎల్‌ఎల్‌పీ ఎగ్జీక్యూటివ్‌ డైరెక్టర్‌ థామస్‌ లామ్‌ పేర్కొన్నారు.

కాగా ఇళ్ల కొరత, లగ్జరీ ఇళ్ల అమ్మకాలు హాంగ్‌ కాంగ్‌ లో తక్కువ ఉండటం వల్ల ఇక్కడి ధనవంతులు ఈ ఇంట్లో అద్దెకు ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube