ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకోవటం కోసం టిడిపి - జనసేన పొత్తు..??

పశ్చిమగోదావరి జిల్లా లో మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పార్టీ కీలకంగా రాణించడానికి రంగంలోకి దిగారు చింతమనేని ప్రభాకర్.రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ నేతగా టిడిపి పార్టీ కీలక నాయకుడిగా పేరొందిన చింతమనేని .జిల్లాలో టిడిపి పార్టీ ని మున్సిపల్ ఎన్నికల్లో ముందంజలో నడిపించడానికి తనదైన వ్యూహాలతో అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడానికి రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో జంగారెడ్డి గూడెం మున్సిపాలిటీ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 Telugu Desam Party And Janasena Alliance To Take Over Municipality ,  Chandrabab-TeluguStop.com

ఈ మున్సిపాలిటీ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని జిల్లా టీడీపీ నేతలు .ఏకంగా జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకుని  ప్రచారంలో శరవేగంగా ముందుకు సాగుతున్నారు.

బీజేపీతో పొత్తు ఉపసంహరించుకుని  మరియు టీడీపీతో ఈ ప్రాంతంలో పొత్తు పెట్టుకోవటంతో … జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది.మొత్తం 29 వార్డులు ఉండగా 24 నామినేషన్లు టిడిపి వేయగా ఐదు చోట్ల జనసేన వేయడం జరిగింది.

అయితే ఎక్కడైతే టిడిపి అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారో.ఆఆ ప్రాంతాలలో జనసేన పార్టీ అభ్యర్థి నిలబెడుతూ జిల్లా టిడిపి నేతలు సరి కొత్త రాజకీయానికి తెరలేపారు.

దీంతో పైకి టీడీపీతో దూరంగా ఉంటున్న గాని లోలోపల లోపాయికారి ఒప్పందంతో చంద్రబాబు పవన్…ఇంకా అదే రీతిలో రాజకీయాలు చేస్తున్నారు అంటూ తాజా వార్తల పై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Telugu Alliance, Andhra, Chandrababu, Janasena, Janga Gudem, Pawan Kalyan-Telugu .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube