అల్లు శిరీష్ హానెస్ట్ స్పీచ్.. అందరూ ఫిదా..?

ఈమధ్య కొత్త కొత్త కథలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకులు.స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు, యువ హీరోలతో మంచి ప్రేమ కథలను చేస్తున్నారు.

 Allu Sirish Launches Love Life And Pakodi Theatrical Trailer, Allu Sirish, Love-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇటీవలే విడుదలైన ఉప్పెన కాస్త కొత్త ప్రేమ కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇక ముందు కూడా ఎప్పుడు వచ్చే కథలు కాకుండా ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరో ప్రేమకథ తో ముందుకు వస్తున్న సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ ఈ సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందిస్తుందని.జయంతి గాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కార్తీక్ విమల్ రెబ్బ, సంచిత పొనాచ జంటగా నటించారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వస్తున్నాయి.ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.ఇక ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.బుధవారం ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ స్టార్ అల్లు శిరీష్ విడుదల చేశారు.

ఈ విధంగా ఆయన మాట్లాడుతూ.

సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆడియన్స్ ఈ లెవెల్ లో సినిమాలకు వచ్చి ఎంకరేజ్ చేస్తారని అనుకోలేదని తెలిపాడు.

ప్రేక్షకులు ధైర్యంగా బయటికి వచ్చి సినిమాలు చూడటం వల్ల తాము సంతోషంగా ఉండగలుగుతున్నారట‌.ఇక ఆయన ఆర్టికల్ చదివి దర్శకుడి సినిమా చేశారని తెలిపాక సంతోషంగా ఉందంటూ సినీ పరిశ్రమకు కొత్త టాలెంట్ తో వచ్చిన వాళ్లను ఎంకరేజ్ చేయడంలో శ్రీధర్ గారు ముందుంటారని తెలిపారు.

అంతే కాకుండా కొత్త దర్శకులను పరిచయం చేస్తుంటాడని తెలిపాడు.ఇదిలా ఉంటే లవ్ లైఫ్ పకోడీ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుపుతూ తనకు ఈ సినిమా ట్రైలర్ నచ్చిందట‌.

అంతేకాకుండా ఆయనకు లవ్, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలని ఉందట.ఎందుకంటే నాకు పెళ్లి వయసు వచ్చిందంటూ, బాయ్ ఫ్రెండ్ అనేది బాగానే ఉంటుంది కానీ హస్బెండ్ అంటేనే భయంగా ఉందని ఓ వ్యాఖ్యానిచ్చాడు.

ఇక దర్శకుడు తన ఉద్యోగాన్ని వదిలి యూ ఎస్ నుండి ఇక్కడికి వచ్చారని అంటేనే సక్సెస్ వైపు అడుగు వేసినట్లు తెలుపుతూ తన తాతయ్య రామలింగయ్య గారు ఇలాగే ఊరు నుండి సినిమాల్లోకి ధైర్యంగా వచ్చాడని తెలిపారు.ఇక ఇదిలా ఉంటే శ్రీకారం, ఏ1 ఎక్స్ ప్రెస్, గాలి సంపత్,జాతి రత్నాలు విడుదల అవుతున్నాయి.

అంత పెద్ద చిత్రాలతో పాటు ఈ చిత్రాన్ని కూడా వీక్షించండి అంటూ తెలిపాడు.ఇక ఆయన నటిస్తున్న కొత్త సినిమా గురించి వివరాలు తర్వాత చెబుతానంటూ మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube