ఫాస్ట్ టాగ్ నుండి మరి కొన్ని ఫీచర్స్..?!

వాహనాదారులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ‏ను తప్పనిసరి చేసింది.జాతీయ రహదారులపై ప్రయానించే వారు తప్పకుండా తమ వాహనాలకు ఫాస్టాగ్ కలిగి ఉండాలి.

 Another New Features Of Fastag , Rates , Latest News, Central Government, High W-TeluguStop.com

లేదంటే అత్యధికంగా ఫైన్స్ కట్టాల్సి ఉంటుందని గతంలోనే కేంద్రం హెచ్చరించింది.దీంతో హైవే లపై టోల్ గేట్ల వద్ద పేమెంట్ చేయడం సులభం.

నేరుగా మనీ కట్టాల్సిన పనిలేకుండా.ఈ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది కేంద్రం.

తాజాగా ఇందులో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పెట్రోల్, డీజిల్, పీఎన్జీ వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఫాస్టాగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

కస్టమర్లు తమ ఫాస్టాగ్ ద్వారా మరిన్ని సేవలను ఉపయోగించుకోవచ్చు.కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా పార్కింగ్ ఫీజును కూడా ఫాస్టాగ్ ద్వారా చెల్లించవచ్చు.

ఇప్పటికే ఈ సేవలను హైదరాబాద్, బెంగుళూరు ఎయిర్ పోర్టులలో అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ సక్సెస్ అయితే.

ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టుతో సహా పలు ప్రాంతాల్లో ఈ ఫాస్టాగ్ పార్కింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం.

Telugu Central, Contact, Fastag, Highways, Latest, Fee Fasttag, Pilot Project, R

ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఫాస్టాగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ఫాస్టాగ్ వలన హైవేలపై రద్ధీ తగ్గిపోవడమే కాకుండా.

కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఇదిలా ఉండగా.గత నెల ఫిబ్రవరి 15 నుంచి ప్రతి వాహనాదారులకు ఫాస్టాగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది.

గతంతో పోలిస్తే టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగే సమయం గణనీయంగా తగ్గింది.జైపూర్‌ టోల్‌ప్లాజ్‌ దాటాలంటే గతంలో ఒక్కో వాహనానికి 30 నిమిషాలు పడుతుండగా, ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లో దాటుతున్నారని ఇటీవలే కేంద్ర మంత్రి తెలిపారు.

జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వివరించారు.ఇప్పటికీ ఈ ఫాస్టాగ్ ను తీసుకోని వారుంటే వెంటనే దీనిని తీసుకోవడం ఉత్తమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube