పాపం.. యాంకర్ అవకాశం ఇప్పిస్తానని చెప్పి దారుణంగా.... 

ఈ మధ్యకాలంలో కొందరు ఇతరుల ఆశలని, అవకాశాలని అదునుగా చేసుకుని పలు ఆర్థిక మోసాలకు ఒడిగడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి ఓ యువతిని బుల్లితెర యాంకర్ ని చేస్తానంటూ ఆమె ద్వారా దాదాపుగా ఇరవై లక్షల రూపాయలకు పైగా డబ్బు తీసుకుని దారుణంగా మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Men Cheat Women For Money In Vijayawada, Anchor Offers, Tollywood, Small Screen-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే మోక్షాల అచ్చి రెడ్డి అనే వ్యక్తి స్థానిక రాష్ట్రంలో నివాసముంటున్నాడు. అయితే ఇతడు డబ్బు సంపాదించడం కోసం అవసరాల్లో ఉన్న యువతను టార్గెట్ గా చేసుకున్నాడ.

 ఈ క్రమంలో విజయవాడకి చెందినటువంటి ఓ యువతికి సినిమా పరిశ్రమలో రాణించాలని చాలా ఆసక్తి ఉండేది. దీంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలువురు పెద్దలతో తనకి పలుకుబడి ఉందని కాబట్టి తనకు సినిమా అవకాశాలు మరియు యాంకర్ గా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు.

 అలాగే ఆమె నుంచి దాదాపుగా 20 లక్షల రూపాయలు దోచుకున్నాడు.అనంతరం తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నాడు.దీంతో మోసపోయిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన డబ్బును తిరిగి ఇప్పించాలంటూ కోరింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అచ్చిరెడ్డి ని పట్టుకునే పనిలో పడ్డారు.

ఈ క్రమంలో ఎట్టకేలకు నల్గొండలో అచ్చి రెడ్డి అరెస్టు చేశారు.

విచారణ చేసే క్రమంలో పోలీసులు అచ్చి రెడ్డి చేసిన ఘాతుకాలు గురించి పలు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే అచ్చి రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరి మహిళల దగ్గర దాదాపుగా 75 లక్షల రూపాయలు కాజేసినట్లు తెలిపాడు.

అంతేగాక నల్గొండ జిల్లాలో కూడా ఓ వ్యక్తితో జ్యోతిష్యం పేరుతో దాదాపుగా 5 లక్షల రూపాయలు దోచుకున్నట్లు తెలిపాడు.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్రమంలో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ అదేదో టాలీవుడ్ సినిమాలో డబ్బు కోసం హీరో చేసే పనులను చూసి రెడ్డి ఇన్స్పైర్ అయినట్టు ఉన్నాడంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube