కోట్లకు అధిపతి చేసిన తిమింగలం వాంతి.. అది ఎలా అంటే..?!

సాధారణంగా మనకు తెలిసినంత వరకు మనుషులు వాంతి చేసుకుంటూ ఉంటారు.అయితే ఓ తిమిగలం వాంతితో కోటిశ్వరులు అయ్యారు.

 Whale Vomit Made Millionaire To A Thailand Woman , Crores, Whale Vomit, Viral Ne-TeluguStop.com

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. థాయ్‌లాండ్ మహిళ విషయంలో అదే జరిగింది.

సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆమెకు ఒడ్డున ఓ వింత వస్తువు కనిపించింది.చుడ్డానికి ఎంతో వికారంగా ఉన్న ఆ వస్తువును ఆమె వద్దనుకుంటునే ఇంటికి పట్టుకొచ్చింది.

అలా అయిష్టంగా తీసుకొచ్చిన ఆ వస్తువు తీరా చూస్తే కోట్లు పలుకుతుందని తెలిసింది.అంతే.

ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.అయితే ఇంతకు ఆ వికారమైన వస్తువు ఎంటో చెప్పలేదు కదూ.అది ఓ తిమింగలం వాంతి.

వాంతి పదార్థం బరువు సుమారుగా 7 కిలోల వరకు ఉంది.దాని విలువ దాదాపుగా 1,86,500 పౌండ్లుగా ఉంటుందని తేల్చారు.అయితే దాన్ని విక్రయించడం కోసం ఆమె నిపుణులను సంప్రదించగా.దాన్ని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని కాలనీలో పనులు చేపట్టేందుకు ఉపయోగిస్తానని తెలిపింది.దాని విలువ 2.50లక్షల డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.90కోట్లు).

Telugu Rupees, Thailand, Latets, Whale Vomit-Latest News - Telugu

వివరాల్లోకి వెళ్తే.థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్(49) అనే మహిళ ఈ నెల 23న తన ఇంటి సమీపంలో ఉండే నాఖోన్ సి తమ్మరత్ ప్రావిన్స్ బీచ్‌కు సరదాగా వెళ్లింది.ఆ సమయంలో ఆమెకు బీచ్ ఒడ్డున ఓ వింత వస్తువు కనిపించింది.

ఇక తిమింగలాల నుంచి స్రవించే ద్రవం ఈ విధంగా వాంతుల రూపంలో బయటపడుతుంది.ఇది చాలా ఖరీదైనది.

దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో వీటిని వాడతారు.ఇది బూడిద రంగులో మైనం ముద్దలా ఉంటుంది.

మండే గుణం కూడా కలిగి ఉంటుంది.తిమింగలాలు తినే జీవుల వల్ల గొంతులోపలి భాగాలు దెబ్బతినకుండా స్రవించే ద్రవమే వాంతి రూపంలో బయటపడుతుంది.

ఇది చాలా విలువైనది.అందుకే శాస్త్రవేత్తలు దీనిని నీటిపై తేలియాడే బంగారం అని కూడా పిలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube