'ఆర్‌ఆర్‌ఆర్‌' కేవలం ఆ రైట్స్‌ కు రూ.200 కోట్ల ఆఫర్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ వచ్చే నెలతో పూర్తి కాబోతుంది.సినిమా విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించారు.

 Star Entertainment Offers Big Amount For Ntr Ram Charan Rajamouli Rrr Movie  , F-TeluguStop.com

అక్టోబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ను రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లతో అద్బుతంగా చిత్రీకరిస్తున్నాడు అంటూ ఆయన విడుదల చేసిన ఇంట్రో వీడియోలతో కన్ఫర్మ్‌ అయ్యింది.

అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ను భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు మేకర్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు.ప్రముఖ బయ్యర్లు మరియు ఓటీటీ వారు ఈ సినిమా ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్‌ వారు ఈ సినిమా నిర్మాతలకు ఏకంగా రూ.200 కోట్లా ఆఫర్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

స్టార్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ వారు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ ను దక్కించుకునేందుకు గాను రూ.200 కోట్లను ఆఫర్‌ చేసినట్లుగా చెబుతున్నారు.ఇప్పటి వరకు ఏ సినిమా కు కూడా ఈ స్థాయిలో స్టార్‌ వారు ఆఫర్‌ చేసింది లేదు.ఈ రేంజ్ ఆఫర్‌ కు నిర్మాత దానయ్య ఓకే చెప్పనున్నాడా సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక మరింత మొత్తం వచ్చేందుకు వెయిట్‌ చేస్తాడా అనేది చూడాలి.

ఈ సినిమా ను దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు.విడుదలకు ముందే ఈ సినిమా 600 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఈసినిమా లో ఆలియా భట్ మరియు అజయ్‌ దేవగన్ ఇంకా హాలీవుడ్‌ స్టార్స్ కూడా ఉండటం వల్ల ఈ రేంజ్ ఆఫర్‌ ను స్టార్‌ వారు ఇచ్చారని అంటున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు 250 కోట్ల రూపాయలను ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్‌ కు గాను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube