నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా... నిధి అగర్వాల్

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా విడుదలైన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 I Take A Lot Of Care In That Regard ,nidhi Agarwal,actress Nidhi Agarwal,latest-TeluguStop.com

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ తన అందచందాలతో కుర్ర కారును మత్తెక్కించింది.ఇస్మార్ట్ శంకర్ తరువాత వరుస ఆఫర్లు దక్కిచ్చికుంటుందనుకున్న నిధి పెద్దగా ఏ సినిమాలోనూ అలరించలేదు.

అయితే ఈ ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితం గురించి తన అభిమానులతో పంచుకుంది.ఏ హీరోయిన్ మీదనైనా పుకార్లు రావడం సహజం.

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి పుకార్లు అనేవి సర్వసాధారణమైన విషయం.నా జీవితంలో ఎటువంటి పుకార్లకు తావివ్వనని, అందుకోసం నేను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటానని నిధి అగర్వాల్ తెలిపింది.

అంతేకాక నేను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని, మెసేజ్ చేయడానికి గాని, ఫోన్ చేయడానికి గాని ఎవరూ లేరని తెలిపింది.ప్రతి ఒక్కరు వారి జీవితంలోకి కొత్త వారిని ఆహ్వానించాల్సిందే నని, నేను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని బాధేమీ లేదని, ఎటువంటి రిలేషన్ షిప్ కోసం నేను వేచిచూడటం లేదని నిధి అగర్వాల్ పేర్కొంది.

ఏది ఏమైనా నేనిప్పుడు సింగిల్ అని భవిష్యత్తులో పుకార్లకు ఈ వ్యాఖ్యలతో చెక్ పెట్టిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube