మోసం ప్రస్తుతం లోకంలో వేగంగా విస్తరిస్తున్న నెట్‌వర్క్.మోసానికి చెక్ పెట్టడానికి కష్టపడి దారులను కనిపెడితే, సులువుగా మరో కొత్తదారిని వెతుక్కోని మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లూ.
ఇలా అనేక మంది ఆన్లైన్ కేటుగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.ఈ విషయంలో ప్రభుత్వాలు, బ్యాంకులు ఎంతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం ఉండటం లేదు.
ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను స్వయంగా అలర్ట్ చేస్తోంది.
ఇకపోతే ఈ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ లో ఉండే ఎస్‌బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఇక సైబర్ నేరగాళ్లూ పంపే మెసేజ్‌లో, రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని వెల్లడిస్తూ, ఒక లింక్ కూడా పంపుతారు.ఇది నిజమని నమ్మి పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేసి, వాళ్లు అడిగిన వివరాలన్నీ నమోదు చేస్తే మన అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవడం ఖాయామట.
ఈ విధంగా కొందరు హ్యాకర్లు ఎస్బీఐ ఖాతాదారులకు ఫేక్ మెసేజ్ లతో వల విసురుతున్నారని, ఇలాంటి మెసేజ్ ల విషయంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.