ఒకప్పటి క్రికెటర్లు నేడు బస్సు డ్రైవర్లు..!

సాధారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా క్రికెట్ ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరైనా ఆటగాళ్లు ఒక్కసారి జాతీయ జట్టుకు ఎంపిక అయితే చాలు వారి జీవితం మొత్తం పూర్తిగా మారిపోతుంది.

 Suraj Ranadeev, Chintaka Jayasinghe, Waddington As Mv, Bus Drivers, Matches, T20-TeluguStop.com

అలాగే వారి జీవితకాలం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా కొనసాగుతుంది.కానీ మిగతా దేశాల క్రికెట్ ఆటగాళ్లకు మాత్రం అలాంటి పరిస్థితి లేదు.

వారికి  మ్యాచ్ ఫీజులు కూడా చాలా తక్కువగానే ఇస్తూ ఉంటారు.ఈ తరుణంలో వారు ఉపాధి కోసం ఇతర పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

ఇందులో భాగంగానే తాజాగా శ్రీలంక, జింబాబ్వేకు చెందిన మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో ఒక బస్సు డ్రైవర్ గా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సూరజ్ రణదీవ్, చింతక జయసింఘే, అలాగే జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ ఎంవెయెంగా ప్ర‌స్తుతం మెల్‌ బోర్న్‌ లో ఒక స్థానిక క్రికెట్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూ ఉంటే మరోవైపు ట్రాన్స్ డే అనే కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఆ కంపెనీకి సంబంధించి ఇటీవల దాదాపు 1,200 మంది డ్రైవర్లను నియమించుకున్నారు.ఇందులో ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ద్వారా వారికి వచ్చే ఆదాయం చాలా తక్కువ అని, వారి కుటుంబాలను పోషించుకోవడం కోసం ఇలా బస్సు డ్రైవర్ గా మారాలని తెలియజేస్తున్నాను.

Telugu Bus Drivers, Matches, Suraj Ranadeev, Waddington Mv-Latest News - Telugu

ఇది ఇలా ఉండగా శ్రీలంక టీం తరపున సూరజ్ రణదీవ్ 12 టెస్టులు, 31 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.అలాగే శ్రీలంక జట్టు తరఫున చింతక జయసింఘే 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించాడు.2005-06 సీజన్ లో జింబాబ్వేకు చెందిన వాడింగ్టన్ ఎంవెయెంగా ఒక టెస్టు, 3 వన్డేల్లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube