బీసీసీఐ కు కేటీఆర్ రిక్వెస్ట్..!

ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ పునరాలోచనలో పడింది.ఈఏడాది నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్‌ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

 Ktr-request-to-bcci Minister Ktr, Bcci, Request, Ipl 2021, Social Media, Viral ,-TeluguStop.com

ఈ సందర్భంగా కేటీఆర్‌ బీసీసీఐతో పాటు ఐపీఎల్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు.

ఈ తరుణంలో ఐపీఎల్‌ నిర్వహణ కోసం వేర్వేరు నగరాల పేర్లను పరిశీలిస్తున్నాం.

హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం.ప్లే ఆఫ్, ఫైనల్‌ మ్యాచ్‌లు ఎలాగూ అహ్మదాబాద్‌ లోనే జరుగుతాయి అని బీసీసీఐ ఉన్నతాధికారి శనివారం చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వచ్చే ఐపీఎల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐని రిక్వెస్టు చేశారు.అన్ని మెట్రో నగరాలకన్నా హైదరాబాద్‌లో కరోనా కేసులు చాలా తక్కువ అని పేర్కొన్నారు.

ఐపీఎల్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

రాబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్‌ మ్యాచ్‌ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు.అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నాయని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్‌ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఐపీఎల్‌ నిర్వహించాలని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరి ఐపీఎల్‌ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube