టీడీపీ బుట్టలో వాలంటీర్లు పడతారా ?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో లక్షలాది మంది వాలంటీర్లను నియమించుకుంది.ప్రభుత్వ పథకాలను వారి ద్వారా ప్రజలకు అందించే ఏర్పాట్లు చేసింది.

 Tdp Try To Support On Volanteers , Village Volanteers, Jagan, Ap Government, Ysr-TeluguStop.com

ఇప్పటికీ ఏ ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు చేరాలన్న వారధిగా వాలంటీర్లే ఉంటున్నారు.ఈ విధమైన సేవలను వాలంటీర్ల ద్వారా అందిస్తూ పారదర్శకతకు మారుపేరుగా తమ ప్రభుత్వం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది.

దీని కోసం సొంత పార్టీ నాయకులు సైతం వాలంటీర్ల పై పెత్తనం లేకుండా చేసింది.ప్రస్తుతం 5 వేలు జీతం మాత్రమే ఇస్తున్నారు.

వారిని ఉద్యోగుల్లా కాకుండా, ప్రజా సేవకులు గా ప్రభుత్వం భావిస్తోంది.అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ పై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే, విమర్శలు చేస్తూ వచ్చింది.

ప్రజలను మభ్యపెట్టి వైసీపీకి మేలు చేసే విధంగా వాలంటీర్ లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికలలో వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు.ఇటీవల తమ జీతాలు పెంచాలంటూ వలంటీర్ల నుంచి పెద్ద డిమాండ్ రావడం, అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు చోటు చేసుకోవడం వంటి వ్యవహారాల పై టిడిపి ఇప్పుడు దృష్టి పెట్టింది.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జీతాలు భారీగా పెంచుతాము అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించడం సంచలనంగా మారింది.

50 ఇళ్లకు ఒక వాలంటీర్ ప్రస్తుతం పనిచేస్తూ వస్తుండడంతో, వాలంటీర్లను తమ వైపు తిప్పుకోగలిగితే రాబోయే ఎన్నికలలో తమకు ఎదురే ఉండదని టిడిపి కొత్త ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తోంది.అందుకే మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థపై పెద్ద ఎత్తున విమర్శలు చేసినా ఇప్పుడు అదే వాలంటీర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడకు టీడీపీ నడుం బిగించింది.టీడీపీ ప్రభుత్వం వస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు, భారీ ఎత్తున జీతాలు పెంచుతూ, అనేక ఆఫర్లు ఇస్తూ, తమ బుట్టలో వేసుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Telugu Ap, Jagan, Kesineni Nani, Tdp Volanteers, Vijayawada Mp, Volanteers, Ysrc

మరోవైపు చూస్తే జగన్ వాలంటీర్లకు ప్రాధాన్యం పెంచ విధంగానే వ్యవహరిస్తున్నారు.జీతాలు వ్యవహారంపై స్పందించకపోయినా, సన్మానాలు, సత్కారాలు చేస్తామని ప్రజలలో వారి ప్రాధాన్యత మరింత పెంచుతాం అంటూ భరోసా ఇస్తూ, వారి అండదండలు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఏ వ్యవస్థ అయితే వైసీపీకి కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారో అదే వాలంటీర్లను తమ వైపు తిప్పుకుని ఆ పార్టీకి గట్టి దెబ్బ కొట్టాలనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube