ఆ హీరో మూవీలో ఛాన్స్ వస్తే వదులుకోనంటున్న బుట్టబొమ్మ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ మొదట్లో ఆశించిన స్థాయిలో గుర్తింపును సంపాదించుకోలేకపోయిన పూజా హెగ్డే ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో నటించడం ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం పూజా హెగ్డేకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడం జరిగింది.పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ రెండు సినిమాలు ఈ ఏడాది జూన్, జులై నెలల్లో విడుదల కానున్నాయి.

 Pooja Hegde Interesting Comments About  Vijay 65th Movie 65th Movie , Interestin-TeluguStop.com

ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వార్తలపై స్పందించిన పూజా హెగ్డే విజయ్ తో సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ 65వ సినిమాలో తనకు హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని తనకు కూడా ఈ సినిమాలో నటించాలని ఆశగా ఉందని తెలిపారు.

Telugu Pooja Hegde, Vijay-Movie

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో తాను హీరోయిన్ గా ఎంపికైతే తప్పకుండా ఈ సినిమాలో నటిస్తానని ఈ ప్రాజెక్ట్ లో తనకు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.పూజా హెగ్డే కామెంట్లను పరిశీలిస్తే విజయ్ మూవీకి పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో ఉందని అయితే పూజాను ఫైనలేజ్ చేయలేదని అర్థమవుతోంది.మరి పూజాకు ఈ మూవీలో ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు పూజా హెగ్డేకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా తెలుగులో మంచి ఆఫర్ వస్తే మాత్రం ఇక్కడ నటించడానికి కూడా పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం గమనార్హం.పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube