వీడియో వైరల్: ప్రాణాలకు తెగించి కుక్కను కాపాడిన మహిళ..!

కుక్కలకి మనుషులకి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాలా సందర్భాల్లో కుక్కలు తమ యజమానుల ప్రాణాలు కాపాడాయి.

 Viral Video Woman Saves Dog Risking Her Life , Dog, Rescued, Frozen Pool, Viral-TeluguStop.com

కొన్ని కుక్కలు విషసర్పాలతో పోరాడి తమ ప్రాణాలను పోగొట్టుకొని తమ యజమానులను కాపాడాయి.మరి కొన్ని కుక్కలు ప్రమాదకరమైన మృగాలతో పోరాడి యజమానులను రక్షించాయి.

తమ ప్రాణాలు పోయినా సరే తమ యజమానుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రతి కుక్క ఆలోచిస్తుంది.యజమానులు కూడా తమ పెంపుడు కుక్కల ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు సైతం లెక్క చేయరు.

అలాంటి సంఘటనే అమెరికాలో ఒకటి చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఒక యజమాని తన కుక్క ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు.

ఎముకలు గడ్డకట్టించే నీటిలో దూకి తన కుక్క కోసం చాలాసేపు వెతికి చివరికి దాన్ని పట్టుకొని బయటకు తెచ్చారు.నిజానికి ఎముకలు గడ్డకట్టించే చలిలో ఎక్కువ సమయం ఉంటే రక్తనాళాలు చిట్లిపోయి చనిపోయే ప్రమాదం ఉంది.

ఈ విషయం తెలిసినా కూడా యజమాని తన శునకం ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతోనే నీటిలోకి దూకి పెద్ద సాహసమే చేశారు.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.అమెరికా దేశం టెన్నెస్సీ నగరం ముర్ఫ్రీస్‌బోరో లో జెన్నీ టాటమ్ నివసిస్తున్నారు.ప్రస్తుతం అమెరికా దేశవ్యాప్తంగా బాగా మంచు కురుస్తుంది.దీంతో ఎక్కడ చూసినా అంతా గడ్డకట్టిన మంచే కనిపిస్తోంది.జెన్నీ టాటమ్ ఇంటి చుట్టు కూడా మంచు పేరుకుపోయింది.

వారి ఇంటి వెనుక ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా మంచు గడ్డగా మారిపోయింది.ఐతే గత వారం లో ఆమె రెండు పెంపుడు కుక్కలు ఆడుకుంటున్న సమయంలో ఒక కుక్క పొరపాటున స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది.

ఆ కుక్క మంచు పొర లో చిక్కుకొని అలాగే స్విమ్మింగ్ పూల్ అడుగు భాగంలో ఉండిపోయింది.అయితే ఇంకొక కుక్క గట్టిగా అరవడంతో జెన్నీ టాటమ్ ఘటన స్థలానికి వచ్చి అసలు విషయాన్ని గ్రహించి వెంటనే తన కుక్కని బయటకు తెచ్చి ప్రాణాలు కాపాడారు.

అయితే ప్రస్తుతం ఆ కుక్క ఆరోగ్యం బాగానే ఉంది.అయితే ఈ దృశ్యాలు అంతా సీసీ టీవీ పుటేజ్ లో రికార్డయ్యాయి.

ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube