అగ్ర రాజ్యంలో తెలుగు ఎన్నారైల గ్రీట్ అండ్ మీట్..!!

అగ్ర రాజ్యం అమెరికాకు వివిధ దేశాల నుంచీ వలసలు వెళ్తూ ఉంటారు.ఇందులో భారత్ నుంచీ వెళ్ళే వారి సంఖ్యే అత్యధికంగా ఉంటుంది.

 Greet And Meet Telugu Nris In The Top Kingdom , America, Greet And Meet, Rajesh-TeluguStop.com

ఇక భారత్ నుంచీ అమెరికా వెళ్ళే వారిలో అత్యధిక శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికం.తెలుగు ఎన్నారైలు అందరూ ప్రాంతాలకు తగ్గట్టుగా పలు సంస్థలు ఏర్పాటు చేసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.

అయితే తాజాగా తెలుగు ఎన్నారైలు అందరిని ఒకే వేదికగా చేసుకుని తెలుగు ఎన్నారై గ్రీట్ అండ్ మీట్ అనే కార్యక్రమం నిర్వహింపబడింది.

అమెరికాలోని కాలిఫోర్నియా లో గల ప్లీజన్ టన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు వారు అందరూ హాజరయ్యారు.

అలాగే కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్చార్జి టీవీ నాగేంద్ర ప్రసాద్, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు, రాజేశ్ రెడ్డి, APNRT ఛైర్మెన్ మాడపాటి వెంకట్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం ఎన్నారైల కోసం కల్పించే వసతులు, అవకాశాలు, పారిశ్రామిక పెట్టుబడులు పై అవగాహన కల్పించారు.

ప్రభుత్వం ఏ విధంగా రాయితీలు ఇస్తుంది, ఈ రాయితీలు ఎన్నారైలకు ఉపయోగ పడే విధానాలను APNRT ఛైర్మెన్ మాడపాటి వివరించారు.

Telugu America, Apnrt Chairman, Greet Meet, Rajesh Reddy-Telugu NRI

APNRT తరుపున అమెరికాలోని తెలుగు వారికోసం ఎన్నో విశిష్ట కార్యక్రమాలు చేపట్టామని, దేవాలయాల దర్సనం, ఇమ్మిగ్రేషన్ పై సలహాలు, సూచనలు, ప్రయాణాల మార్గాదర్సాకాలు, వీసాలకు సంభందించిన వివరాలు, కుటుంభ ఆరోగ్య భీమా, కేంద్రం కల్పిస్తున్న సౌకర్యాలు ఇలా ఎలాంటి విషయాలలో అయినా APNRT తరుపున సాయం అందుతుందని ప్రకటించారు.కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్చార్జి టీవీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ OCI , వీసా, పాస్పోర్ట్మ్ కాన్సులేట్ సర్వీసులపై ఎన్నారైల సందేహాలపై సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమం అమెరికాలో ఉండే ప్రతీ తెలుగువారికి ఎంతో ఉపయోగపడుతుందని ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube