ఉగాది కి గ్రామ వాలంటీర్ లను ప్రోత్సహించే రీతిలో జగన్ సరికొత్త డెసిషన్..!!

జగన్ ఆలోచనల నుండి పుట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవల జీతాలు పెంచాలని ధర్నాలు నిరసనలు చేపట్టడంతో వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా చేసే వంటి క్లారిటీ ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని జగన్ సరికొత్త డెసిషన్ తీసుకోవడం జరిగింది.

 Good News For Grama Volunteers Ys Jagan,ysrcp,grama Volunteers,award Volunteers-TeluguStop.com

దీంతో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం తరఫున గిఫ్ట్ అందించడానికి సరికొత్త ఆలోచనలు వైసీపీ ప్రభుత్వం చేసింది.

పూర్తి మ్యాటర్ లోకి వెళితే గత ఏడాది కాలంగా ఎవరైతే తమ బాధ్యతలను సక్రమంగా ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా సేవా దృక్పథంతో చేశారో వారిని గుర్తించి మూడు కేటగిరీలో ప్రోత్సాహకాలు అందించడానికి జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దీంతో సంవత్సరం పాటు నిరంతరాయంగా అందించిన గ్రామ, వార్డు వాలంటీర్ లను గుర్తించి వారికి సేవా మిత్ర పురస్కారం బ్యాడ్జి తో పాటు పది వేల రూపాయల నగదును అందించాలని జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఇక రెండో కేటగిరిలో ప్రతి మండలం పట్టణంలో ఐదుగురిని ఎంపిక చేసి వారికి సేవ రత్న పురస్కారం తో పాటు 20 వేల రూపాయల నగదు కూడా అంద చేయబోతున్నారట.

ఇక మూడో కేటగిరీలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురిని ది బెస్ట్ ఎంపికచేసి సేవా వజ్ర పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాచ్ మెడల్ అదే విధంగా 30 వేల రూపాయలు అందివ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube