మాఘ పూర్ణిమ 2021: మాఘ పౌర్ణమి రోజు ఏ విధంగా పూజ చేయాలి.. ప్రాముఖ్యత ఏమిటి!

తెలుగు మాసాలలో వచ్చే మాఘమాసానికి హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ నెలంతా హిందువులు భక్తిశ్రద్ధలతో ఆ విష్ణుమూర్తిని వేడుకుంటారు.

 Magha Pournami 2021 Significance Of Magha Pournami And Pooja Vidhi, Magha Pourna-TeluguStop.com

అదేవిధంగా ఇంతటి పవిత్రమైన నెలలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు.హిందూమతంలో ఈ మాఘ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

అయితే మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు ఉదయం పవిత్రమైన నదులలో స్నానం చేసి, దానధర్మాలు చేస్తూ ఆ విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భక్తులు భావిస్తారు.అయితే మాఘ పౌర్ణమి ఎప్పుడు? పౌర్ణమి రోజు ఏ విధంగా స్వామివారిని పూజించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హిందువులు పౌర్ణమి వచ్చే తిథిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి రోజుల్లో వస్తుంది.అదేవిధంగా మరుసటి రోజు నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుంది.అయితే ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి 2021 ఫిబ్రవరి 27 వచ్చింది.

ఈ మాఘ పౌర్ణమి రోజు భక్తులు ఉదయం ఎంతో పవిత్రమైన గంగానది వంటి నదులలో లేదా నీరు పారుతున్న కాలువల వద్ద వేకువజామునే స్నానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.అయితే పౌర్ణమి ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం3:49 నుంచి ప్రారంభం అయ్యి శనివారం మధ్యాహ్నం1:46 నిమిషాలకు ముగుస్తుంది.కాబట్టి 27వ తేదీ ఉదయం పౌర్ణమి ఉంటుంది కనుక 27వ తేదీ నదీ స్నానాలు ఆచరించడం ఎంతో ఉత్తమం.

మాఘ పౌర్ణమి రోజు పవిత్ర గంగానదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని చెబుతారు.

ఈ పౌర్ణమి రోజు కాశి, హరిద్వార్, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానాలు ఆచరించడం ఎంతో పుణ్య ఫలాన్నిస్తుందని పురాణాలు చెబుతాయి.ఎంతో పవిత్రమైన ఈ మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేయడం వల్ల విష్ణు మూర్తి వారికి అదృష్టం, సకల సంపదలను కల్పిస్తారని ప్రతీతి.

అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు భక్తులు ఉపవాస దీక్షలను చేస్తూ ఆ విష్ణు భగవానుడిని పూజిస్తారు.అలాగే పౌర్ణమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube