పదేళ్ల తర్వాత అల్లరి నరేష్‌ ఆ ఘనత దక్కించుకున్నాడు

అల్లరి నరేష్‌ మొదటి సినిమా అల్లరి 2002 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అప్పటి నుండి పదేళ్ల పాటు అంటే 2012 వరకు కంటిన్యూస్ గా మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటూ బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్‌ లను అల్లరోడు తన ఖాతాలో వేసుకుంటూ వచ్చాడు.2012లో అల్లరి నరేష్‌ సుడిగాడు సినిమా తర్వాత మళ్లీ సక్సెస్‌ అనేది లేకుండా పోయింది.2013 నుండి ఆయన బ్యాడ్‌ టైం కంటిన్యూ అవుతూ వచ్చింది.అంతకు ముందు సినిమాలు ఒక మోస్తరుగా ఆడినా యాక్షన్ త్రిడి, కెవ్వుకేక, లడ్డు బాబు సినిమా ల నుండి మొదలుకుని మొన్నటి బంగారు బుల్లోడు సినిమా వరకు ఏ ఒక్క సినిమా కూడా బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లను దక్కించుకున్నది లేదు.వరుసగా సినిమా లు నష్టాలను పర్చుతున్న సమయంలో ఈయన హీరోగా సినిమాలను నిర్మించేందుకు అసలు నిర్మాతలు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

 Allari Naresh Movie Naandhi Collections In Two Weeks ,tollywood , Allari Naresh-TeluguStop.com

ఎట్టకేలకునాంది సినిమా తో దాదాపు పదేళ్ల తర్వాత అల్లరి నరేష్‌ బ్రేక్ ఈవెన్‌ ను దక్కించుకున్నాడు.టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాంది సినిమా తెలుగు రాష్ట్రాలు అన్ని కలిపి 2.8 కోట్ల రూపాయల బిజినెస్ ను చేసింది.ఇప్పటి వరకు ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.చాలా కాలం తర్వాత బయ్యర్లకు అల్లరోడి సినిమా సక్సెస్‌ ను తెచ్చి పెట్టింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.దాదాపుగా అయిదు కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలను వసూళ్లు దక్కించుకోవడంతో పాటు శాటిలైట్‌ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ ఇతర రైట్స్‌ ద్వారా మరో అయిదు కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.మొత్తంగా ఈ సినిమా ఎనిమిది కోట్లకు పైగానే ఈ సినిమా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.కనుక 4 కోట్ల వరకు ఈ సినిమా షేర్‌ దక్కించుకున్న ఆశ్చర్యం అక్కర్లేదు.మొత్తానికి అల్లరోడు సుదీర్ఘ కాలం తర్వాత బ్రేక్ ఈవెన్‌ దక్కించుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube