పునర్నవిని ఆ హీరోయిన్ తో పోల్చిన నెటిజన్.. ఆమె ఏమందంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని పాపులారిటీని సంపాదించుకున్నారు పునర్నవి భూపాలం.బిగ్ బాస్ షోలో పాల్గొనక ముందు పునర్నవి కొన్ని సినిమాల్లో నటించినా ఆ షో ద్వారానే పునర్నవికి గుర్తింపు దక్కింది.

 Punarnavi Bhupalam Reacts  To Netizen Comment In Social Media,big Boss, Malimali-TeluguStop.com

బిగ్ బాస్ షో తర్వాత పలు వెబ్ సిరీస్ లలో నటించిన పునర్నవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ తో ఫ్రెండ్ షిప్ చేసి వార్తల్లో నిలిచిన పునర్నవి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రాహుల్ కు దూరంగా ఉంటున్నారు.

తాజాగా పునర్నవి ఒక ఫోటోను సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.ఆ ఫోటోను చూసిన ఒక నెటిజన్ ఆమెను నిత్యామీనన్ తో పోల్చారు.తనను అభిమాని నిత్యామీనన్ తో పోల్చడం గురించి పునర్నవి స్పందిస్తూ అభిమానికి థ్యాంక్యూ చెప్పారు.

ఆ తరువాత నిత్యామీనన్ తనకు రోల్ మోడల్ అంటూ పునర్నవి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

గతంలో పునర్నవి నిత్యామీనన్ తో కలిసి మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలో నిత్యామీనన్, పునర్నవి కాంబినేషన్ లో వచ్చే సీన్లు తక్కువే అయినా ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

ఆ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసింది.

Telugu Netizen, Nitya Menon-Movie

పునర్నవి గతేడాది ఆహా ఓటీటీ కోసం కమిట్మెంటల్ అనే వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు అందరినీ నమ్మించారు.కానీ ఆ తరువాత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం పునర్నవి ఆ విధంగా చేశారని తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube