ప్రైవేట్ కాలేజీలకు హైకోర్ట్ జలక్.. !

విద్యార్ధుల ఫీజుల విషయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల దోపిడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే.నేడు చదువు కొనుక్కునే పరిస్దితులు తలెత్తాయి.

 High Court Jalak For Private Colleges High Court, Private Colleges, Fire Departm-TeluguStop.com

పోని ఇన్నేసి ఫీజులు వసూల్ చేస్తున్నా వసతులు సరిగా ఉండవు.ఈ నేపధ్యంలో ప్రైవేట్ కాలేజీల విషయంలో హైకోర్ట్ వీటికి షాకిచ్చింది.

కాగా హైకోర్టులో జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న అగ్నిమాపక నిబంధనలపై విచారణ జరిగింది.అగ్నిమాపక శాఖ నిబంధనలపై శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల పిటిషన్లపై కూడా విచారణ జరిపింది.

అయితే ఇంటర్ బోర్డ్ మాత్రం నిబంధనలు పాటించని కాలేజీలు మూసివేశామని, ఇందులో భాగంగా నారాయణ, శ్రీచైతన్య కాలేజీలతో సహా మరో 40 కాలేజీలు మూసివేశామని ఇంటర్ బోర్డు పేర్కొంది.

ఇదే సమయంలో చట్టం రాకముందు
నిర్మించిన భవనాలకు కూడా అనుమతివ్వడం లేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటుండగా, నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించిన హైకోర్టు కొన్ని కాలేజీలు కేవలం లాభాల కోసం నడుపుతున్నాయని వ్యాఖ్యానించింది.

ఇక కాలేజీల వాదన ఏ మాత్రం సహేతుకంగా లేదని వెల్లడిస్తూ కాలేజీల పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.

ఇకపోతే ప్రతి కాలేజీలు ఖచ్చితంగా అగ్నిమాపక నిబంధనలు పాటించాలసిందేనని తేల్చి చెప్పింది ఇలా నిబంధనలు పాటించని కాలేజీలపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube