ఈ ఫోటోలో ఉన్న స్టార్ యాంకర్ ను గుర్తు పట్టారా..?

బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలకు, ఆడియో ఫంక్షన్లకు యాంకర్ గా చేయడంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ పాపులారిటీని సంపాదించుకున్నారు శ్రీముఖి.గతంతో పోలిస్తే శ్రీముఖికి యాంకర్ గా అవకాశాలు తగ్గినా ఈవెంట్లలో పాల్గొంటూ శ్రీముఖి సందడి చేస్తున్నారు.

 Anchor Srimukhi Childhood Photo Goes Viral In Social Media, Srimukhi, Childhood-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీముఖికి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.శ్రీముఖి చిన్నప్పటి ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్నారు.

తాజాగా ఒక నెటిజన్ కోరిక మేరకు శ్రీముఖి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన చైల్డ్ హుడ్ ఫోటోను షేర్ చేశారు.పటాస్ షో ద్వారా బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే బుల్లితెరపై, సోషల్ మీడియాలో శ్రీముఖి తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడంతో పాటు అభిమనులతో ముచ్చటిస్తూ శ్రీముఖి ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

Telugu Bigg Boss, Bomma Adirindi, Childhood, Netizen, Srimukhi, Telugu Anchor-Mo

ఏవైనా సరదా ప్రశ్నలు ఉంటే అడగాలని శ్రీముఖి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.ఆ సమయంలో ఒక నెటిజన్ శ్రీముఖి చిన్నప్పటి ఫోటోను షేర్ చేయాలని కోరారు.బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సీజన్ 3 రన్నర్ గా నిలిచిన శ్రీముఖి వ్యాపారంపై దృష్టి పెట్టారు.లువి పేరుతో శ్రీముఖి బ్యూటీ ఉత్పత్తులను ప్రవేశపెట్టారు.

మరోవైపు శ్రీముఖి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షో తర్వాత పరిమితంగా షోలు చేస్తున్న శ్రీముఖి జీ తెలుగు ఛానల్ లో బొమ్మ అదిరింది అనే షోకు కొంతకాలం యాంకర్ గా చేయగా కొన్ని కారణాల వల్ల ఆ షో ఆగిపోయింది.

బొమ్మ అదిరింది సీజన్ 2 ఉంటుందని ప్రచారం జరుగుతున్న నిజంగా సీజన్ 2 ప్రారంభమవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube