మోహన్ బాబు తనయుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన నటుడు మంచు విష్ణు.అతని సినిమాల పరంగా సక్సెస్ రేట్ తక్కువగానే ఉన్న నటుడుగా మాత్రం తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.అలాగే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు.జయాపజయాలు పక్కన పెడితే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ నుంచి రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న హీరోగా మంచు విష్ణు ఉన్నాడు.
ప్రస్తుతం కెరియర్ లోనే భారీ బడ్జెట్ట్ తో పాన్ ఇండియా మూవీగా మోసగాళ్ళు సినిమాని అతను చేస్తున్నాడు.ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ తో మంచు విష్ణు పనిచేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు చెల్లిగా నటిస్తుంది.ఐటీ కుంభకోణం నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.టీజర్ రిలీజ్ చేయడానికి టైం కూడా ఫిక్స్ చేశారు.
మరో వైపు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ సీక్వెల్ కూడా పట్టాలెక్కించి పనిలో విష్ణు ఉన్నారు.దానిని సొంతం ప్రొడక్షన్ లోనే నిర్మించి హీరోగా నటించనున్నాడు.ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు.గతంలో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో కన్నప్ప సినిమాని చేయాలని అనుకున్నాడు.
మైథలాజికల్ కథాంశంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కించాలని అనుకున్నారు.అయితే అనుకున్న స్థాయిలో విష్ణుకి మార్కెట్ లేకపోవడంతో భారీ బడ్జెట్ తో అతను హీరోగా కన్నప్ప ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తే నష్టపోవడం గ్యారెంటీ అని వెనక్కి తగ్గారు.
అయితే మోసగాళ్లు సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్న విష్ణు నెక్స్ట్ కన్నప్పని కూడా లైన్ లోకి తీసుకొచ్చారు.కన్నప్ప కథకి మరింత మెరుగులు దిద్దే బాధ్యతని సాయి మాధవ్ బుర్రాకి అప్పగించారు.
త్వరలోదానికి రూపకల్పన చేయనున్నట్లు బోగట్టా.