క‌జ‌క్ భాష నేర్చుకున్న చిన్నారి పెళ్లికూతురు.. ఎందుకంటే..?

చిన్నారి పెళ్లికూతురుగా టీవీ ప్రేక్షకులకు పరిచయమై ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అవికా గోర్.తెలుగులో హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో గుర్తింపును సంపాదించుకోలేకపోయినా అవికా గోర్ కు నటిగా మాత్రం మంచి పేరు వచ్చింది.

 Actress Avika Gor Learning Kazakh Language  Movie Shares Video, Actress Avika Go-TeluguStop.com

రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

అయితే ఈ చిన్నారి పెళ్లికూతురు ప్రస్తుతం కజక్ భాషను నేర్చుకుంటోంది.

అవికాకు ఒక కజక్ మూవీలో ఆఫర్ వచ్చిందని.ఆ మూవీలో నటించాలనే ఉద్దేశంతోనే ఆమె కజక్ భాషను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం అవికా గోర్ నటిస్తున్న సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుండగా అవికా కజక్ భాషలో నటిస్తూ వీడియోను పోస్ట్ చేశారు.ఆ వీడియోలో అవిక కజక్ భాషలోనే మాట్లాడటం గమనార్హం.

సాధారణంగా ఇతర రాష్ట్రాల భాషలను నేర్చుకోవడం సులభమైనా ఇతర దేశాల భాషను నేర్చుకోవడం సులభం కాదు.కానీ అవిక మాత్రం సులభంగా భాషను నేర్చుకోవడంతో పాటు గలగలా మాట్లాడేస్తున్నారు.

ఎంతో ప్రతిభ ఉంటే మాత్రమే ఈ విధంగా వేరే దేశ భాషలో మాట్లాడటం సాధ్యమవుతుంది.ప్రస్తుతం అవికా గోర్ నుర్లాన్ కోయంబ‌యేవ్ అనే సినిమాలో నటిస్తున్నారు.

అవికా గోర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఆమె టాలెంట్ ను చూసి తనదైన శైలిలో స్పందిస్తున్నారు.ఆవికా స్క్రీన్ క్రియేష‌న్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆమె సినిమాలను సైతం నిర్మిస్తున్నారు.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినా అవిక వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.అయితే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడం అవికా గోర్ కెరీర్ కు మైనస్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube