ఈ ల‌క్ష‌ణాలు ఉంటే.. మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్టే?

మాన‌వ శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) ఒక‌టి.శ‌రీరంలో మ‌లినాలాను, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పంప‌డంలోనూ.

 If You Have These Symptoms Your Liver Is In Danger! Symptoms Of Liver Damage, Li-TeluguStop.com

తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలోనూ.శరీరానికి కావల్సిన శక్తిని తయారు చేయ‌డంలోనూ లివ‌ర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయితే ఏక కాలంలో అనేక పనులు చేసే ఈ లివ‌ర్ దెబ్బ తింటే ప్రాణాల‌కే ముప్పుగా మారుతుంది.పైగా లివ‌ర్ ఆరోగ్యం పాడైంద‌ని గుర్తించ‌డం కూడా చాలా క‌ష్టం.

ఎందుకంటే, దాదాపు తొంబై శాతం లివ‌ర్ దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు.

అయితే కొన్ని కొన్ని ల‌క్ష‌ణాల బ‌ట్టీ లివ‌ర్ డ్యామేజ్‌ను గుర్తించవ‌చ్చు.

మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.లివ‌ర్ దెబ్బ తిన్న‌ప్పుడు యూరిన్ ముదురు ఊదా రంగులోకి మారుతుంది.

ఒక‌టి లేదా రెండు రోజులు ఇలా జ‌రిగితే ప‌ర్వాలేదు.కానీ, రెగ్యుల‌ర్‌గా ఇదే కంటిన్యూ అయితే ఖ‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి వ‌స్తుంది.

అలాగే ఎన్ని వ్యాయాలు చేసినా.డైటింగ్ చేస్తున్నా బ‌రువు పెరుగుతున్నా లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్టు భావించాలి.

Telugu Tips, Latest, Liver, Symptomsliver-Telugu Health - తెలుగు హ

ఎందుకంటే, లివ‌ర్ ఆరోగ్యం దెబ‌బ‌తిన్న‌ప్పుడు కూడా బ‌రువు పెరుగుతాయి.ఇక లివ‌ర్‌లో మ‌లినాలు, టాక్సిన్లు ఎక్కువ‌గా పేరుకుపోతే.అప్పుడు శ‌రీరానికి సరైన పోషకాలను పంపలేదు.దాంతో మీరు త‌ర‌చూ అల‌సిపోతుంటారు.చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌లేక‌పోతుంటారు.ఇలా జ‌రిగినా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

ఇక కాలేయం సరిగా పనిచేయకుంటే.వికారంగా ఉండ‌టం, వాంతులు అవ్వ‌డం జ‌రుగుతుంది.తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవ్వ‌దు.ఇలా త‌ర‌చూ జ‌రుగుతుంటే.

త‌గిన జాగ్ర‌త్తులు తీసుకోవాలి.అలాగే లివ‌ర్ దెబ్బతిన‌ప్పుడు.

కుడి వైపు ప్రాంతంలో నొప్పిగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.ఇలాంటి నొప్పి ఉంటే.

మీ కాలేయం డేంజ‌ర్‌లో ఉందని భావించి వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube