గుర్తుపట్టకుండా తయారయ్యిన టాలీవుడ్ హీరోయిన్స్...!!

టాలీవుడ్ లో ఒకప్పుడు అలరించిన హీరోయిన్లు ఇప్పుడు కనిపించకుండా పోయారు.అందం ఉన్నన్ని రోజులు హీరోయిన్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది.

 Tollywood Heroines Who Are Unrecognizable Now, Shobana, Radha, Telugu Actress Si-TeluguStop.com

ఒకసారి ఆ అందం పోయిందా ఎవరు పట్టించుకోరు.మరి ఆలా టాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన కొంత మంది నటీమణులు ప్రస్తుతం గుర్తు పట్టడానికి కూడా వీలు లేకుండా తయారయ్యారు వాళ్లెవరో చూదాం.

అలాంటి వాళ్ళలో రాధా 90వ దశకంలో అందరూ అగ్రహీరోలతో ఆడిపాడిన హీరోయిన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు.అప్పట్లో చిరంజీవితో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రాధా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

రాధ కూతురైన కార్తీక నాగ చైతన్య మొదటి సినిమా అయిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.దానివల్ల తెలుగులో హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు.

జీవా హీరోగా వచ్చిన రంగం సినిమాలో హీరోయిన్ గా నటించిన కార్తీక ఆ సినిమా తెలుగులో డబ్ అవ్వడం ఇక్కడ కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో బోయపాటి శీను, జూనియర్ ఎన్టీఆర్ తీసిన దమ్ము సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కార్తీకకి ఛాన్స్ వచ్చింది.దమ్ము సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తెలుగు లో కార్తీకకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడటంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

రాధా చిన్న కుమార్తె అయిన తులసి మణిరత్నం తీసిన కడలి సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో తులసి కి కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు.అయితే రాధా తన కూతుళ్లు హీరోయిన్స్ అవడంతో తను సినిమాలు మానేసింది.

Telugu Radha, Ravali, Shobana, Teluguactress, Tollywood-Telugu Stop Exclusive To

తెలుగులో అప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన అప్పటికీ ఇప్పుడు సినిమాలు చేయకుండా ఉన్న ఇంకో హీరోయిన్ శోభన.శోభన తెలుగులో చాలా మంచి సినిమాలు చేసింది చిరంజీవి రుద్రవీణ లో ఒక మంచి క్యారెక్టర్ చేసింది.అలాగే మణిరత్నం రజనీకాంత్ మమ్ముట్టిలతో తీసిన దళపతి సినిమా లో రజనీకాంత్ లవర్ గా మంచి క్యారెక్టర్ చేసింది.శోభనం తెలుగులో రీ ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి ఒక మంచి కథ దొరికితే తను రీఎంట్రీ ఇస్తుందో లేదో చూద్దాం.

Telugu Radha, Ravali, Shobana, Teluguactress, Tollywood-Telugu Stop Exclusive To

సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగి ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయకుండా ఉన్న తెలుగు హీరోయిన్ సిమ్రాన్ తెలుగులో బాలకృష్ణ తో చేసిన సమరసింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ పక్కన ఆడిపాడిన సిమ్రాన్ ఆ తర్వాత అగ్ర హీరోలందరితో నటించింది వెంకటేష్ తో కలిసుందాం రా, నాగార్జున తో నువ్వు వస్తావని , చిరంజీవి తో డాడీ , మృగరాజు సినిమాలు చేసింది.అగ్ర హీరోలందరితో చేసి హిట్స్ కొట్టినప్పటికీ సిమ్రాన్, బాలకృష్ణ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది.వీళ్ళ కాంబినేషన్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి.సిమ్రాన్ అప్పుడు అగ్రహీరోయిన్ గా కొనసాగింది ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రావడంతో సిమ్రాన్ కి అవకాశాలు తగ్గాయి.

అయితే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో సూర్య పక్కన నటించి మంచి గుర్తింపు పొందింది.తెలుగులో ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Telugu Radha, Ravali, Shobana, Teluguactress, Tollywood-Telugu Stop Exclusive To

వీళ్ళ తర్వాత చెప్పుకోదగిన ఇంకో హీరోయిన్ రవళి.శుభాకాంక్షలు వంటి సినిమాలో యాక్టింగ్ చేసి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమా లో ఒక హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత నాగార్జున శ్రీకాంత్ హీరోలు వచ్చిన నిన్నే ప్రేమిస్తా సినిమా లో కూడా నటించింది.

చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్టాలిన్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ప్రేక్షకులు అందర్నీ మెప్పించింది.తను ఇప్పుడు సినిమాలో చేద్దామన్న చేయడానికి వీలు లేకుండా బరువు చాలా పెరిగిపోయింది.

Telugu Radha, Ravali, Shobana, Teluguactress, Tollywood-Telugu Stop Exclusive To

వీళ్ళనే కాదు ఇంకా చాలామంది హీరోయిన్స్ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ గా కొనసాగి తర్వాత స్క్రీన్ పై అసలు కనిపించట్లేదు.కొందరు పెళ్లి చేసుకొని సినిమాలను వదిలేస్తే మరికొందరు బరువు ఎక్కువగా పెరగడం వల్ల సినిమాల్లో నటించే అవకాశం లేక నటించలేక పోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube