1947 ఫిబ్రవరి 20.. స్వతంత్ర భారతానికి ఊపిరిలూదిన బ్రిటన్ ప్రధాని ప్రకటన

దాదాపు 200 ఏళ్లు తెల్లదోరల పాలన కింద నలిగిన భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం ప్రపంచ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం.రక్తం చిందకుండా, హింస రేగకుండా జరిగిన ఈ అహింసా పోరాటంలో ఎందరో మహనీయులు బలిదానాలు చేశారు.

 British Prime Minister Attlee Announced To Give Independence To India,  India, B-TeluguStop.com

వారి త్యాగఫలమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం.మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ తదితర యోధులు చేసిన పోరాటం ఫలించి బ్రిటన్ మనకు స్వాతంత్ర్యం ప్రకటించింది.

ఇక స్వాతంత్ర్య పోరాటంలో ఈరోజుకున్న ప్రత్యేకతే వేరు.సరిగ్గా ఇదే రోజు అంటే 1947 ఫిబ్రవరి 20న బ్రిటన్‌ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ.భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు.1948 జూన్ 30 లోపు భారతదేశం విముక్తి పొందుతుందని, తుది (అధికార) బదిలీ తేదీ నిర్ణయించిన తర్వాత సంస్థానాల భవితవ్యం నిర్ణయమవుతుందని అట్లీ తన ప్రకటనలో తెలిపారు.

ఇచ్చిన మాట ప్రకారం జూన్ 3 ప్రణాళిక ఆధారంగా ఒక బిల్లును రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.ఇది 12 రోజుల స్వల్ప వ్యవధిలో (జులై 4 – జులై 16) పార్లమెంట్ ఆమోదముద్ర పొందింది.

జులై 18న బ్రిటిష్ రాజు కూడా దీనిని ఆమోదించారు.ఈ చట్టం ప్రకారం ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు.భారత భూభాగాల విభజన, పంజాబ్, బెంగాల్‌లలో రెండు రాష్ట్రాల ఏర్పాటు గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు.రెండు దేశాలకు ప్రత్యేక గవర్నర్ జనరల్, శాసనశాఖల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

Telugu British, Britishprime, Independence, India-Telugu NRI

క్లెమెంట్‌ అట్లీ 1928 లో సైమన్ కమిషన్‌తో కలిసి భారతదేశానికి వచ్చారు.ఆ సమయంలో ఆయన బ్రిటన్‌ ఎంపీగా ఉన్నారు.అయితే సైమన్ కమిషన్‌కు వ్యతిరేకిస్తూ నాడు భారతీయులు నిరసనలు చేపట్టారు.అట్లీ తరువాత బ్రిటన్ ప్రధాని అయ్యాడు.1945 జూలై సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ అభ్యర్థిగా రాజకీయ ఉద్ధండుడు చర్చిల్‌ను ఓడించాడు.చర్చిల్ భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకించగా.

అట్లీ ప్రధాని కాగానే స్వాతంత్య్రాన్ని ప్రకటించాడు.

అయితే దేశ విభజన అనేక అనర్థాలకు దారితీసింది.సుమారు 1.5 కోట్ల మంది హిందూ ముస్లింలు బలవంతంగా తమ ఇళ్లు, గ్రామాలు, నగరాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది.ఇది వారిలో కోపాన్ని, ద్వేషాన్ని రగిల్చింది.రెండు నుంచి అయిదు లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube