అమెరికాలో మంచు కష్టాలు..గుక్కెడు నీళ్ళకోసం...

అమెరికాను కరోనా మహమ్మారి ఒక పక్క బంతాట ఆడుకుంటుంటే మరో పక్క ప్రక్రుతి అమెరికన్స్ లో గుబులు రేపుతోంది.కొన్ని రోజులుగా ఏడ తెరపి లేకుండా కురుస్తున్న మంచు ప్రభావానికి అమెరికాలో దైనందిక కార్యక్రమాలు అన్నీ లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి.

 Snow Difficulties In America For Water , America, Snow Strom, Texas, Houston, Co-TeluguStop.com

ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడిపోవడంతో ఈ మంచు ధాటికి తట్టుకోలేక సుమారు 60 మంది మృతి చెందారు.పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతోంది.

రోజు వారి పనులకు అవసరమైన మంచి నీరు దొరకక తాగడానికి గుక్కెడు నీళ్ళ కోసం అల్లల్లాడిపోతున్నారు.

మంచు తుఫాను ప్రభావం అత్యధికంగా టెక్సాస్ ,హ్యుస్టన్ లలో మరింతగా తీవ్రతరం అయ్యిందని అధికారులు తెలిపారు.

మంచి నీటికోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.తుఫాను కారణంగా మంచి నీటి పైపులలో ఉండే నీరు గడ్డ కట్టుకుని పోవడంతో నీటి సమస్య విపరీతంగా ఏర్పడింది.

చలిని తట్టుకోలేక మృతి చెందిన వారిలో చాలా మంది మంటలు, విద్యుత్ సంభందిత ప్రమాదాల కారణంగా మృతి చెందిన వారేనని అధికారులు నిర్ధారించారు.

నిత్యఅవసరాలకు కాకపోయినా కనీసం తాగడానికి మంచి నీళ్ళు కావాలంటూ వేలాది మంది ప్రభుత్వానికి వినతులు అందిస్తున్నారు.

ఇక ఆసుపత్రులలో ఉంటున్న రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.వారి ఆకలి, నీటి బాధలను చూసిన టెక్సాస్ లోని ఓ రెస్టారెంట్ వారికి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.

ఆహరం, నీటిని అందిస్తూ రోగులకు అండగా నిలిచింది.అలాగే ప్రభుత్వం కూడా మంచును కరిగించి ఆ నీటిని బాటిల్స్ లో నింపి రోగులకు అందిస్తోంది.ఇక మంచు తుఫాను కారణంగా విద్యుత్ సరఫా సైతం పూర్తిగా నిలిచిపోవడంతో అమెరికాలోని కొన్ని నగరాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు.మంచుని కరిగించుకుని కాచి వడబోసి తాగడం తప్ప మరే ఎలాంటి పరిష్కారం స్థానిక ప్రభుత్వాలు చూపలేక పోతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube