పీక్ టైంలో డిమాండ్ చేసి.. చేతులెత్తేశామా?  టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం

స్థానిక సంస్థ‌ల‌కు, గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి ఇప్ప‌టికే గ్రామ పంచాయ‌తీల‌కు సంబంధించి మూడు ద‌శ‌ల పోలింగ్ కూడా పూర్త‌యింది.అయితే ఈ మూడు ద‌శ‌ల్లోనూ అధికార పార్టీ వైసీపీ దూకుడు క‌నిపించింది.

 Demanded At Peak Time .. Did We Give Up? Introspection In Tdp,ap,ap Political Ne-TeluguStop.com

ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ పుంజుకుంది.చాలా ఎక్కువ పంచాయ‌తీలు ఖాయ‌మ ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వేసుకున్న అంచ‌నాలు ప‌టాపంచ‌ల‌య్యాయి.

ఇది అంద‌రికీ క‌నిపిస్తున్న విష‌యం.పైగా త‌మ‌కు కంచుకోట‌లుగా ఉన్న ప్రాంతాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా టీడీపీ ప‌రిస్తితి చ‌తికిల ప‌డింది.

దీంతో ఈ ప‌రిస్థితిని క‌వ‌ర్ చేసుకునేందుకు నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు.ఈ జిల్లాలో బాగుంది అను కునే ప‌రిస్థితి లేకుండా పోయింది.దీంతో కొంద‌రు నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.పైగా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ వైసీపీ మెజారిటీ పంచాయ‌తీలు ద‌క్కించుకుంది.

పోనీ ఇవ‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌లు అందామా? అంటే మ‌రి టీడీపీ గెలిచిన స్థానాల‌ను కూడా త‌ప్పులుగానే పేర్కొనాల్సి ఉంటుంది.సో ఇది ఎటు చూసినా పార్టీకి సంక‌టంగా మారింది.

దీంతో అస‌లు ఇప్పుడు ఎన్నిక‌లు పెట్ట‌కుండా ఉండి ఉంటే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Latest, Panchayat, War, Ysrcp-Telugu Political News

మ‌న‌మే డిమాండ్ చేశాం.ఎన్నిక‌లు పెట్టాలి పెట్టాలి అన్నాం పెట్టారు.ఏం జ‌రిగింది.

పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం.ఇంటింటికీ రేష‌న్‌వంటి కీల‌క ప‌థ‌కాలు అమ‌లు అవుతున్న ద‌శ‌లో మ‌నం డిమాండ్ చేయ‌కుం డా ఉండి ఉంటే బాగుండేది.

పైగా అమ్మ ఒడి ప‌డిన నెల‌లో ఎన్నిక‌లు వ‌స్తే ఫ‌లితం మ‌న‌కు అనుకూలం గా ఉంటుంద‌ని అనుకోవ‌డం మ‌న త‌ప్పే అనిటీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.మొత్తంగా చూస్తే ఈ ప‌రిణామాలు టీడీపీలో అంత‌ర్గత కుంప‌టిని రాజేస్తున్నాయ‌ని అంటున్నారు.

ప్ర‌ధానంగా అధినేత త‌మ‌కు, త‌మ సూచ‌న‌ల‌కు విలువ ఇవ్వ‌డం లేద‌ని ఇత‌ర నాయ‌కులు భావిస్తున్నారు.ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube