ప్రభాస్ అభిమానులు నిజంగానే భయపడుతున్నారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులకు ఎసరుపెట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

 Prabhas Fans Worried With Radhe Shyam Teaser, Prabhas, Radhe Shyam, Pooja Hegde,-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ టీజర్ చాలా రొమాంటిక్ ఫీల్‌తో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా చూస్తున్నారు.కానీ ప్రభాస్ అభిమానుల్లో మాత్రం భయం నెలకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ టీజర్‌ను పరిశీలిస్తు, ప్రభాస్ తొలుత ఇటాలియన్ భాషలో ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తాడు.దీంతో ఈ సినిమాలో ఇలాంటి డైలాగులు ఇంకా ఎన్ని ఉన్నాయో అని వారు ఆలోచిస్తున్నారు.

అయితే గతంలో టాలీవుడ్‌లో ఇటలీ, స్పెయిన్ భాషలకు సంబంధించి డైలాగులు, పాటలు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.అంతేగాక రాధేశ్యామ్ టీజర్‌లో ప్రభాస్ లుక్ కూడా ఏమంత బాగాలేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సినిమా మొత్తంలో ఇలాంటి లుక్‌తో ప్రభాస్ ఉంటే సినిమా పరిస్థితి ఏమిటని వారు భయపడుతున్నారు.ఇక గతకొన్నేళ్లుగా కేవలం యాక్షన్‌కే పెద్దపీట వేసిన ప్రభాస్, ఈసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో దిగుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏమిటో అని వారు భయపడుతున్నట్లు సినీ క్రిటిక్స్ అంటున్నారు.

కాగా ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్ట్‌తో ఉండబోతుండటంతో ఈ సినిమా చూస్తేనేగాని రాధేశ్యామ్ రిజల్ట్ గురించి ఓ నిర్ణయానికి రాలేమని వారు అంటున్నారు.ఇక ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube