వామ్మో.. జగపతిబాబు ఒక్కరోజు పారితోషికం అన్ని లక్షలా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు జగపతిబాబు.వందకు పైగా సినిమాల్లో హీరోగా నటించిన జగపతిబాబు హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత విలన్ పాత్రలతో పాటు హీరోహీరోయిన్ల తండ్రి పాత్రల్లో నటిస్తున్నారు.

 Actor Jagapati Babu Gets Shocking Remuneration For Movies.tollywood,japathi Babu-TeluguStop.com

ఏ పాత్రలో నటించినా తన నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో పాటు జగపతిబాబు విలన్, తండ్రి పాత్రల్లో నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి.

లెజెండ్ సినిమాలోని జితేంద్ర పాత్ర జగపతిబాబుకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఆ మూవీ సక్సెస్ కు కారణమైంది.

అయితే జగపతిబాబు పారితోషికం గురించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.జగపతిబాబు రోజుకు పది లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విలన్ గా మారిన తరువాత జగపతిబాబుకు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి.

Telugu Jagapatibabu, Morethan Lakhs, Rangasthalam-Latest News - Telugu

అయితే గతంలో ఒక సందర్భంలో జగపతిబాబు తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సెకండ్ ఇన్నింగ్స్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని తనకు ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ లేదని సబ్జెక్ట్, సినిమా బడ్జెట్ ను బట్టి తన పారితోషికం కూడా మారుతుందని జగపతిబాబు అన్నారు.పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ జగపతిబాబు మెప్పిస్తూ ఉండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ హీరోల స్థాయిలో జగపతిబాబు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.అయితే జగపతిబాబు కథ నచ్చి ఒక సినిమాలో ఫ్రీ నటించడానికి అంగీకరించానని గతంలో చెప్పారు.

రంగస్థలం సినిమాలో విలన్ పాత్ర కూడా జగపతిబాబుకు మంచిపేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.హీరోగా కంటే విలన్ పాత్రల ద్వారానే జగపతి బాబు ఎక్కువ మొత్తం సంపాదిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube