వాలెంటైన్స్ డే బహుమతిగా ఇదే దొరికిందా.. వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత విమర్శ‌లు.. ?

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు రోజుల క్రితం ఏపీలో వాలంటీర్లు వేతనాలు పెంచాలంటూ చేస్తున్న ధర్నాలు, ఆందోళనలన విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 Tdp Leader Gorantla Butchaiah Chaudhary Comments On The Ycp Government  Tdp Lead-TeluguStop.com

అయితే తాజాగా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ విషయంలో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక మా నాయకుడు జగన్ గారు ఉక్కు మనిషి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నార‌ని, మరి ఆ ఉక్కు మనిషి ఉక్కు పరిశ్రమ పోతుంటే చేతులు కట్టుకుని చూస్తు ఉన్నారంటూ చుర‌క‌లంటించారు.

ఇక ప్రేమికుల రోజు సందర్భంగా వైసీపీ నాయకులు కేంద్రం పై ప్రత్యేక హోదా గురించి పోరాడకుండా ఎప్పటి లాగే ప్రేమ ఒలకబోస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వెల్లడిస్తున్నారు.

ఇకపోతే కేంద్రం పై ప్రేమ ఉంటే సొంత డబ్బులు పెట్టి గిఫ్ట్స్ కొని ఇవ్వాలని, ఇలా వాలెంటైన్స్ డే బహుమతి గా స్టీల్ ప్లాంట్ ని ఇవ్వాలని చూడకుండా మరో మార్గం వెతుక్కుంటే మంచిదని అని గోరంట్ల ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube