పోలింగ్ రోజున సర్పంచ్ అభ్యర్థికి ప్రమోషన్.. జీవితంలో మరచిపోదు.. !

అప్పుడప్పుడు మనిషి జీవితంలోకి కొన్ని ఆనందాలు తెలియకుండా పలకరిస్తాయి అంటారు.పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఒక మహిళ జీవితంలో కూడా ఇలాగే జరిగింది.

 Promotion For Sarpanch Candidate On Polling Day, Surpanch Candidate, Birth Baby,-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుంటే.

ఏపీలోని కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేశారు.

అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో 9 నెలల గర్భంతో పాల్గొని అందర్ని ఆశ్చర్యపరిచారు.ఇక ఈ రోజు ఉదయం కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన సర్పంచ్ అభ్యర్థి లీలా కనకదుర్గకు పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయట.వెంటనే ఆమెను కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందట కనకదుర్గ.

తల్లిబిడ్దలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని సమాచారం.

కాగా ఈ ఆనంద సమయాలను పంచుకుంటూ పోలింగ్ రోజున బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని వెల్లడించింది.

ఇక ఈ ఎన్నికల్లో కనకదుర్గ సర్పంగా గెలిస్తే ఆ జ్ఞాపకాలు ఎప్పుడు వెన్నంటే ఉంటాయిగా అని అంటున్నారట కొందరు.మరి బిడ్దపుట్టిన వేళా విశేషం మంచిదైతే ఈమె సర్పంచ్ అని అనుకుంటున్నారట స్దానికులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube