బీజేపీతో పొత్తు... ప‌వ‌న్‌కు పీక‌ల మీద‌కు వ‌చ్చిందా ?

బీజేపీ పొత్తు.పెట్టుకున్నారు.దీనికి కార‌ణం ఏంటో ఇత‌మిత్థంగా ఇప్ప‌టికీ.జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలియ‌దు.ఏదో మా నాయ‌కు డు పొత్తు పెట్టుకున్నారు.మేం ఫాలో అవుతున్నాం.

 Alliance With Bjp Became Headache To Pawan Kalyan, Alliance, Bjp, Headache, Pawa-TeluguStop.com

అనే మాట‌నే వ‌ల్లెవేస్తున్నారు.ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం బీజేపీ తో పొత్తు పెట్టుకుంది.

రాష్ట్రం కోస‌మే.రాష్ట్ర అభివృద్ధి కోస‌మే అంటారు.

మ‌రి ఇదే నిజ‌మైతే.మంచిదే.

రాష్ట్రానికి మేలు చేస్తామంటే ఎవ‌రు మాత్రం కాదంటారు.కానీ.

బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక కూడా రాష్ట్రం విష‌యంలో మౌనంగానే ఉండ‌డం.పైగా జ‌న‌సేన పార్టీని పెద్ద‌గా కేంద్రంలోనిబీజేపీ నాయ‌కులు లెక్క చేయ‌క‌పోవ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది.

విష‌యంలోకి వెళ్తే.కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల క‌లిసి వ‌చ్చారు.కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి తెలంగాణ‌కు చెందిన కిష‌న్‌రెడ్డి ఏకంగా ప‌వ‌న్‌ను దుశ్సాలువాతో స‌త్క‌రించారు.లంచ్ పార్టీ కూడా ఇచ్చారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.అయితే.

ఈ క్ర‌మంలో అటు జ‌న‌సేన డిమాండ్ల‌పైకానీ.ఇటు ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై కానీ.

ప‌వ‌న్ వారితో పెద్ద‌గా చ‌ర్చించ‌లేక పోయార‌ని అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు.పార్టీ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడితే.

చూద్దాం.చేద్దాం.

మీరు అనుకున్న‌ట్టుగానే అన్నీ జ‌రుగుతాయి.అని హామీ ఇచ్చిన‌ట్టు చెప్పార‌ట‌.

Telugu Alliance, Andhra Pradesh, Bjp, Headache, Janasena, Panchayat, Pawan, Pawa

కానీ.క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంద‌ని జ‌న‌సేన నాయ‌కులే ముచ్చ‌డించుకుంటున్నారు.ఈ ప‌రిణామాల‌తో ఇక‌, బీజేపీతో పొత్తు పెట్టుకుని తాము సాధించేది ఏంటి? అనేది జ‌న‌సేన నేత‌ల ఆవేద‌న.ఇది పార్టీ ప‌రంగా! ఇక‌, రాష్ట్రం ప‌రంగా చూసుకుంటే.

మ‌రో కీల‌క స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది జ‌న‌సేన‌.రాజ‌ధాని విష‌యం నుంచి ప్ర‌త్యేక‌హోదా వ‌ర‌కు కేంద్రాన్ని ఒప్పించాల‌నే ఒత్తిళ్లు ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన‌కు బాగానే త‌గులుతున్నాయి.

మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక‌.మా వాద‌న వారికి వినిపించి ఒప్పించండి! అని ఇటీవ‌ల అమ‌రావ‌తి రైతులు.

ప‌వ‌న్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు.ఇక‌, హోదా విష‌యంపై ఎవ‌రూ మాట్లాడ‌లేద‌నుకోండి.

మ‌రోవైపు విశాఖ ఉక్కు విష‌యం ఇప్పుడు జ‌న‌సేన‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది.ఉత్త‌రాంధ్ర వెనుక‌బ‌డి ఉంద‌ని.ప‌దే ప‌దే త‌న ప్ర‌సంగాల్లో దంచి కొట్టిన ప‌వ‌న్‌.ఇప్పుడు అదే ఉత్త‌రాంధ్ర‌కు మేలు చేయ‌క‌పోగా.

ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించే ప‌నిని చేస్తుండ‌డంతో ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు మౌనం వీడ‌క‌పోవ‌డం కూడా పార్టీపై వ్య‌తిరేక‌త పెంచుతోంది.బీజేపీతో స్నేహంగా ఉండి కూడా విశాఖ ఉక్కును కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌డంలేద‌ని అప్పుడే అధికార పార్టీ నుంచి విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి.

ఇక‌, ఇప్ప‌డు విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా.ప‌వ‌న్‌కు ఇది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మార‌నుంది.

వెర‌సి.బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం లాభం.

అన్నీ క‌ష్టాలే! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి దీనికి ప‌వ‌న్ ఏం చెబుతారో.

విశాఖ ఉక్కుపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube