ఈ ఫొటోలో క్లాప్ కొడుతున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అష్టా-చమ్మ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన టాలీవుడ్ హీరో నాని గురించి సినిమా సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నాని సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు.

 Natural Star Nani Ashta Chamma Movie Throw Back Photo, Natural Star Nani, Telugu-TeluguStop.com

ఆ తర్వాత తన న్యాచురల్ యాక్టింగ్ తో నేచురల్ స్టార్ నాని గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా నాని కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

 అయితే ఇంతకీ ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే అష్టా చమ్మా చిత్రంలో శ్రీనివాస్ అవసరాల నటిస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా నాని క్లాప్ కొడుతున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఫోటోని ఇటీవలే ప్రముఖ సినీ ఇన్ఫర్మేటివ్ సంస్థ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

దీంతో నాని అభిమానులు ఈ ఫోటోని తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాని వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.

 ఇటీవలే నాని హీరోగా నటించినటువంటి “వి” అనే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 దీంతో ప్రస్తుతం నాని తెలుగులో “టక్ జగదీష్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని కి జంటగా తమిళ బ్యూటీ “ఐశ్వర్య రాజేష్” హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని నాని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube