ప్రియాంకా చోప్రా ఆడిషన్ కోసం వెళ్తే అలా చూసారంటా

అమ్మాయిలు హీరోయిన్స్ గా సినిమా రంగంలో ఎదగాలని అనుకున్నప్పుడు వారికి రకరకాల వేధింపులు ఎదురవుతూ ఉంటాయి.వారికి స్టార్ ఇమేజ్ వచ్చే వరకు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతాయి.

 Priyanka Chopra Faced Harassment In Career Starting, Bollywood, Hollywood, India-TeluguStop.com

అయితే కొంత మంది సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చే వారకి ఇలాంటి వేధింపులు కొంత తక్కువగా ఉంటాయి.బ్యాగ్రౌండ్ లేకుండా మోడలింగ్ నుంచి సినిమాలలోకి వచ్చే కతానాయకలకి కెరియర్ ఆరంభంలో లైంగిక వేధింపులు కచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి.

అయితే వీటిని అందరూ బయటపెట్టారు.గత కొన్నేళ్ళుగా మీటూ ఉద్యమం సినిమా రంగంలో నడుస్తూ ఉండటంతో చాలా మంది హీరోయిన్స్ తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి మనసు విప్పి చెప్పుకుంటున్నారు.

అలాగే కొంత మంది అయితే మరో అడుగు ముందుకేస్తూ తమని వేధించిన వారి పేర్లు కూడా బయటపెడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా యూనివర్శల్ నటి ప్రియాంకా చోప్రా తన కెరియర్ ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనలని తన ఆత్మకథలో రాసుకొచ్చింది.

కెరియర్ ఆరంభంలో తనకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని పేర్కొంది.ఆడిషన్ కోసం వెళ్తే తనని అక్కడి దర్శక, నిర్మాతలు కామంతో చూసేవారని తెలిపింది.అలాగే తనకి కొంత మంది సలహాలు కూడా ఇచ్చారని రాసుకొచ్చింది.తాను ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోవాల‌ని అందం కొలతలు సరిచేసుకోవాలని లైంగికంగా ప్రేరేపించేలా కూడా చేయ‌మ‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు కోరిన‌ట్లు ఆత్మ‌క‌థ పుస్త‌కంలో వెల్ల‌డించారు.

ఓ సినిమా ఆడిష‌న్స్ కోసం వెళ్తే స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత న‌న్ను నిల‌బెట్టి కామంతో చూస్తూ నాకు ఎద అందాలు చూపించాలని, నా పిరుదులు పెంచాలని దారుణంగా మాట్లాడేవారని పేర్కొంది.హీరోయిన్‌గా కావ‌లంటే నా అందాల నిష్ప‌త్తిని ప‌రిష్కారించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

లాస్ఏంజెల్స్‌లో అలా స‌రిచేయ‌గ‌ల గొప్ప వైద్యుడు తెలుస‌ని అన్నాడు.అప్ప‌టి మేనేజ‌ర్‌తో త‌న ఒప్పందాన్ని వినిపించాడని తెలిపారు.

ఆ ప్రపోజ‌ల్స్ విన్నాక తాను అక్క‌డినుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాన‌ని త‌ర్వాత ఆ మేనేజ‌ర్‌ని తొల‌గించాన‌ని ఆ పుస్త‌కంలో ప్రియాంక‌ ఆసక్తికర నిజాలు రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube