అమ్మనా ఉత్తర కొరియా.. ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఇంత నీచానికి దిగజారావా.. ??

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక నియంత అన్న విషయం తెలిసిందే.ఇతను శక్తిమంతుడైన తన మేనమామను ఉరితీయడం, తన సవతి సోదరుడి హత్య తో తనను తాను కరుడుగట్టిన వ్యక్తిలాగా చిత్రీకరించుకుని నియంతలా ఉత్తర కొరియాను పాలిస్తున్నాడని ప్రచారంలో ఉందట.
ఉత్తర కొరియా దేశం ఆర్ధికంగా నిలదొక్కుకునే అంశాల కంటే క్షిపణి వ్యవస్థ, అణు సామర్ధ్యం పెంచుకోవడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది.దీని వల్ల ఉత్తర కొరియా ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నంగా ఉంది.

 North Korean Hackers Stole More Than $300 Million To Pay For Nuclear Weapons,nor-TeluguStop.com

ఒక దశలో క్షిపణి వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి మిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నాడట కిమ్ జోంగ్ ఉన్.ఈ దేశం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రక్షణ వ్యవస్దకు పెద్ద సంఖ్యలో ఎలా డబ్బును ఖర్చు చేస్తుందో ఎవరికి అర్ధం కాని విషయం.

అయితే, ఈ అంశం మీద ఐక్యరాజ్యసమితి ఓ నివేదికను తయారు చేసిందట.ఆ నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా తన హ్యాకర్స్ సహాయంతో సైబర్ దాడులకు పాల్పడి వచ్చిన సొమ్మును ఇలా ఖర్చు చేస్తుందట.

కాగా ఐరాస తన రహస్య కమిటీ నివేదికలో సైబర్ దాడులు నిర్వహించి దాదాపుగా 300 మిలియన్ డాలర్లకు పైగా క్రిప్టో కరెన్సీని దొంగియించినట్టు పేర్కొన్నది.

ఇలా దొంగిలించిన సొత్తుతో తమ దేశ అణు వ్యవస్థను అప్డేట్ చేసుకుంటున్నట్టు స్పష్టం చేస్తుంది.

చూశారా ఉత్తర కొరియా తన రక్షణ వ్యవస్దను బలోపేతం చేసుకోవడానికి ఎంత నీచానికి దిగజారుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube