కోవిడ్ టీకా వయల్స్‌ తెరిచిన తర్వాత ఎన్నిగంటల్లో వాడాలో తెలుసా.. ?

కరోనా వింజృభిస్తున్న సమయంలో ఈ వైరస్‌కు విరుగుడు ఉంటే బాగుండు అని ఎంతగానో ఆశపడ్దాం.కానీ కరోనాకు టీకా అందుబాటులోకి వచ్చాక ఈ టీకా వేసుకోవాలంటే చాల మంది భయపడుతున్నారు.

 Do You Know How Many Hours After The Opening Of Covid Vaccine Vials, Covid 19, V-TeluguStop.com

దీని వల్ల ఈ వ్యాక్సిన్ పక్రియ ఆశించిన స్దాయిలో జరుగడం లేదు.అంతే కాదు చాలా టీకాలు వేస్ట్ అవుతున్నాయట.

ఇలా ఎందుకంటే.ఏ మందుకైనా ఒక ఎక్స్‌పైర్ డేట్ ఉంటుంది.కానీ కరోనా వ్యాక్సిన్‌కు మాత్రం మూత తీసిన తర్వాత నాలుగు గంటలలోపు మాత్రమే మొత్తం టీకా మందును ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందట లేదంటే ఆ మందు వ్యర్ధమేనట.తెరిచిన వయల్స్‌ను నాలుగు గంటలలోపు ఉపయోగించక పోతే ఈ టీకా తీసుకుని కూడా ప్రయోజనం ఉండదని త్రిపుర ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కల్లోల్ రాయ్ తెలుపుతున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం, జనవరి 16 న టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో 5,000 మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్లు వృధా అయ్యాయని, ఈ నష్టం 10 శాతం కంటే ఎక్కువగా ఉందని త్రిపుర రాష్ట్ర అధికారులు వెల్లడించారు.ఇకపోతే నాలుగు గంటల సమయం దాటిన టీకా ఉపయోగించడం వల్ల రోగి కరోనా వైరస్ నుంచి పూర్తిగా రక్షించబడకపోవటంతో పాటు మరికొన్ని కొత్త సమస్యలకు దారితీస్తుందని వీరు వెల్లడిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube