చక్రధరుడు అని విష్ణుమూర్తి ని ఎందుకు పిలుస్తారు..?

మన పురాణాల ప్రకారం దేవ దేవతలందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆయుధం కలిగి ఉంది.ఆంజనేయుడికి గద, పరమ శివుడికి త్రిశూలం, అదేవిధంగా కాళీ మాత కు త్రిశూలం ఇలా ఒక్కో దేవతలకు ఒక్కో రకమైన ఆయుధాలను కలిగి ఉన్నాయి.

 How Did Vishnu Get The Name Chakradhar, Vishnu, Chakradhar, Sudarshan Chakra, Po-TeluguStop.com

దేవతలందరూ ఇలాంటి ఆయుధాలను కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే లోక రక్షణార్ధం అసురులు, రాక్షసులను సంహరించడానికి దేవతలందరూ ఈ విధంగా ఆయుధాలను ఉపయోగించేవారు.ఈ క్రమంలోనే సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైన విష్ణు భగవానుడికి సుదర్శన చక్రం ఆయుధంగా ఉంటుంది.

ఈ విధంగా సుదర్శనచక్రాన్ని ఆయుధంగా కలిగి ఉండటం వల్ల విష్ణు భగవానుడిని “చక్రధరుడు” అని కూడా పిలుస్తారు.అసలు సుదర్శనచక్రం ఆయుధంగా పొందడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

విష్ణు భగవానుడు  ఆయుధంగా పొందడానికి గల కారణం ఆ పరమశివుడు అని చెప్పవచ్చు.పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో దానవమూకలు ఎంతో శక్తివంతులు అయ్యారు.వీరివల్ల లోకంలోని మునులు, ఋషులు, మానవులను విచక్షణ రహితంగా హింసించేవారు.వీరి ఆకృత్యాలను భరించలేక దేవతలందరూ విష్ణు చెంతకు చేరి ఎలాగైనా వారి నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు.

ఇదంతా కాల వైపరీత్యమే అందుకు ఆ పరమ శివారాధనమే శరణ్యం అంటూ తప్పకుండా వారిని రక్షిస్తానని విష్ణుభగవానుడు శివ దీక్షలోకి వెళ్ళిపోయాడు.

ఈ నేపథ్యంలోనే విష్ణుభగవానుడు పరమశివుడికి వెయ్యి కమలాలతో శివ సహస్రనామాలను అర్పించాలని భావించాడు.ఈ క్రమంలోనే వెయ్యి తామర పువ్వులను కోసుకొచ్చి ఒక్కో పువ్వుకు ఒక్కో నామాన్ని చదువుతూ ఆ పరమశివుని ఆరాధించాడు.శివుడు విష్ణువు పరీక్షించాలని కావాలనే ఒక పుష్పాన్ని దాచి ఉంచాడు.

అది గ్రహించని విష్ణుమూర్తి 999 పుష్పాలు పూర్తయ్యేవరకు పూజలో నిమగ్నమై ఉంటాడు.చివరిగా ఒక పుష్పం తక్కువగా ఉందని తెలుసుకోగానే వెంటనే లోకమంతా విష్ణు భగవానుడిని కమలాక్షుడు అని పిలవడం గుర్తు రాగానే వెంటనే తన 1000 వ నామం అర్పించడానికి తన నేత్రాన్ని పెకలించటానికి సిద్ధపడుతున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వెయ్యి పుష్పాలు తనకు సమర్పించావని తెలియజేశారు.

లోక రక్షణార్థం ఇంతటి సాహసానికి ఒడిగట్టిన విష్ణుమూర్తిని చూసి పరమ శివుడు తనచే నిర్మితమైన సుదర్శనం అనే చక్రాన్ని ఇస్తాడు.ఈ సుదర్శనచక్రాన్ని ఇస్తూ “దీనికి ఎదురు లేదు, ఎంతమంది నిర్జించినా తిరిగి నీ దరికి చేరుతుందని” తెలియజేస్తాడు.

అప్పటి నుంచి విష్ణు భగవానుడికి చక్రి, చక్రధరుడు, చక్రపాణి అనే పేర్లతో పూజిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube