బాబోయ్.. ఉప్పెనలో విజయ్‌ భజన మరీ ఎక్కువ అయ్యింది

ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో పది మంది యంగ్ దర్శకులతో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులందరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నాడు.ఈ సందర్బంగా చిరంజీవి నుండి మొదలుకుని చిత్ర వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఉప్పెన లో నటించిన విజయ్‌ సేతు పతి గురించి మాట్లాడారు.

 Vijay Sethupathi In Mega Vaishnav Tej Uppena Movie Event , Vijay Sethupathi, Upp-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా విజయ్ సేతు పతి గురించి ప్రత్యేకంగా మాట్లాడటంతో పాటు ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.చిరంజీవి ఏకంగా మూడు నాలుగు నిమిషాల పాటు ఆయన ను పొగడ్తలతో ముంచెత్తాడు.

సుకుమార్‌ కూడా ఉప్పెన సినిమాలో నటించడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశాడు.ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ఉండటం వల్ల స్థాయి పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Buchi Babu, Chiranjeevi, Sukumar, Uppena, Vaishnav Tej, Vijaysethupathi-M

చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకున్న సమయంలో ఖచ్చితంగా విజయం ను ఈ సినిమా దక్కించుకున్నట్లు అయ్యిందని అన్నాడు.తాను సైరా సినిమా కోసం జార్జియా వెళ్లాము.అక్కడ విజయ్‌ సేతుపతి అభిమానులు చూసి ఆశ్చర్య పోయాను.అక్కడి కి వచ్చిన వారు విజయ్‌ సేతు పతి ని చూసి కాని అక్కడ నుండి వెళ్లము అన్నారు.

దాంతో ఆయన వెళ్లి వారికి కలిశాడు.అప్పుడు కాని వారు అక్కడ నుండి వెళ్లలేదు.

ఆయనకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని వరుసగా హీరోగా సినిమాలు చేయవచ్చు.కాని పాత్రలు నచ్చితే చేసుకుంటూ వస్తున్నాడు.

ప్రతి సినిమాను ఆయన చేయడం పట్ల ఆయనకు నటన పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమా తో పాటు ఆయన చేస్తున్న సినిమాలు అన్ని కూడా తెలుగు వారు ఆధరిస్తారు అంటూ మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పారు.

మొత్తానికి విజయ్ సేతుపతి భజన సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube