ఆ ఊరిని చూసి అలాంటి వారు బుద్ది తెచ్చుకోవాలట.. !?

ప్రస్తుత సమాజంలో అవినీతి మరక అంటుకోని నాయకుడు లేడు.డబ్బులకు అమ్ముడు పోనీ ఓటరు లేడు.

 A Village Where Votes Are Not Sold, Ap, Narasapuram, Kopparru Village, Votes Not-TeluguStop.com

ఎన్నికలప్పుడు కుక్కలకు బిస్కట్స్ వేసినట్లుగా నాయకులు మందు, మనీ, బిర్యానీలు పంచుతారు.గెలిచాక ప్రజలను కుక్కలా చూస్తారు.

గెలిచిన వారితో ఏమైన పనులు చేపించు కోవాలంటే వారి చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి.ఇలా డబ్బులు పంచి గెలిచిన వారితో అభివృద్ధి కూడా శూన్యం.అయితే చాల మంది ఓటర్లు తేలికగా తీసుకునే విషయం ఏంటంటే.

బలమైన ఆయుధం ఓటు.రక్తం చిందించకుండా అవినీతి నాయకులకు బుద్ధిచెప్పే అవకాశం ఓటు.అంతే కాదు నీతివంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకొవడానికి ఉన్న ఏకైక మార్గం ఓటు హక్కు.మరి ఈ విషయాన్ని మరచిన ప్రజలు డబ్బులకు కక్కూర్తి పడి, అవినీతికి గొడుగు పడుతున్నారు.

ఇకపోతే ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అనే బోర్డులతో అందరిని ఆకట్టుకుంటున్న గ్రామం ఏపీలో ఉన్న నరసాపురం మండలంలోని ‌కొప్పర్రు గ్రామం.

ఈ గ్రామంలో ఉన్న ప్రతి గోడ, ప్రజలకు కత్తి చేతికివ్వలేదు.ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చారు.పోరాడి రాజులవుతారో, ఓడిపోయి బానిసలవుతారో, నిర్ణయం మీ చేతుల్లోనే.ఓటు‌ ఆయుధం లాంటిది దానిని కులం కోసమో, వర్గాల కోసమో, డబ్బు కోసమో వృధా చేయవద్దంటూ రాసిన అక్షరాలతో పలకరిస్తుందట.

ఇలా రాసిన అక్షరాలు ఆ గ్రామంలోనే కాకుండా పక్క ఊర్ల వాళ్ళను ఆకర్షిస్తున్నాయట.నిజమే కదా ఇలా అందరు ఆలోచించి ఒకే మాట మీద ఉంటే మంచి నాయకుడు పుట్టుకొస్తాడు.

అందుకే ఈ ఊరిని చూసి ఓట్లను అమ్ముకునే వారు సిగ్గుపడాలని అంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube