బిడెన్ గ్యారేజ్..ఇక్కడ అమెరికాకు రిపేర్ చేయబడును...

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో అమెరికా ఆర్ధిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి.కరోన కష్టకాలంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో అటు అమెరికన్స్ ప్రాణాలు, అమెరికా ఆర్ధిక పరిస్థితులు గాలిలో కలిసి పోయాయి.

 Us President Joe Biden First Foreign Policy Speech, Foreign Policy Speech, Us Pr-TeluguStop.com

కరోనా కారణంగా వచ్చిపడిన నిరుద్యోగ సమస్య అమెరికాను అతలాకుతలం చేసిందనే చెప్పాలి.నిరుద్యోగ కుటుంభాలను ప్రభుత్వం సాయం అందిస్తూ పోషించడం అంటే తలకు మించిన భారమే.

ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం ట్రంప్ పదవిని కోల్పోవడం, నూతన అధ్యక్షుడిగా బిడెన్ రావడం అన్నీ జరిగిపోయాయి.

ట్రంప్ మిగిల్చిన నష్టాన్ని ఇప్పుడు నూతన అధ్యక్షుడు బిడెన్ పూడ్చుతున్నారు.

అమెరికా ఇప్పుడు తీరని నష్టాలలో ఉందని అమెరికాకు రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిడెన్ ప్రకటించారు.అమెరికా గౌరవాన్ని కొందరు దిగజార్చారు, మళ్ళీ నేను అమెరికా గౌరవాన్ని పునరుద్దరిస్తానని తెలిపారు బిడెన్.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతా మొట్టమొదటి సారిగా విదేశాంగ శాఖా సమావేశంలో బిడెన్ మాట్లాడారు.అమెరికా మళ్ళీ కొత్త జీవం పోసుకుంటోంది, మన శక్తి ఏంటో చాటాల్సిన అన్ని వనరులు మనం మళ్ళీ సమకూర్చుకుంటామని తెలిపారు.

మన మిత్ర దేశాలు, భాగస్వామ్య దేశాల వద్ద మనం కోల్పోయిన శక్తిని మళ్ళీ పునర్ద్దురించాలని బిడెన్ తెలిపారు.గతంలో కంటే కూడా ప్రస్తుతం మన విదేశాంగ శాఖ అత్యంత చాతుర్యత కలిగిన వ్యక్తులతో నిండి ఉందని వీరి సహకారంతోనే దేశాల మధ్య సంభంధాలు నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కోరారు.

రష్యా మన ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తోందని, చైనా మనకు పోటీగా మారుతోందని ఈ రెండు దేశాలను మనం తెలివిగా ఎదుర్కోవాలని ఈ క్రమంలో నాతో సహా అందరూ ఓ కార్మికుడిలా పనిచేయాలని కోరారు బిడెన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube